English | Telugu

సుధీర్ ని హౌలే అంటూ గాలి తీసేసిన సాయి ప‌ల్ల‌వి

ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ జీ తెలుగులో ఫాద‌ర్స్ డే, మ్యూజిక్ డే సంద‌ర్భంగా `థాంక్యూ దిల్ సే` పేరుతో ఓ ప్ర‌త్యేక‌ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. జూన్ 19న‌ ఈ ఆదివారం ఈ షో ప్ర‌సారం కానుంది. సుడిగాలి సుధీర్‌, శ్రీ‌ముఖి ఈ షోకు యాంక‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోలో టీవీ స్టార్లు, క‌మెడియ‌న్ లు, సింగ‌ర్స్‌, టీవీ సీరియ‌ల్ న‌టీన‌టులు పాల్గొని సంద‌డి చేశారు. ఈ షోలో గెస్ట్ లుగా రానా, సాయి ప‌ల్ల‌వి, సురేష్ బాబు, హీరో గోపీ చంద్‌, రాశీఖ‌న్నా, ద‌ర్శ‌కుడు మారుతి పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఈ షోలో జూలై 1న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` మూవీ హీరో గోపీచంద్‌, హీరోయిన్ రాశీ, ద‌ర్శ‌కుడు మారుతి పాల్గొన్నారు. ఆ త‌రువాత ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన `విరాట‌ప‌ర్వం`లో న‌టించిన రానా, సాయి ప‌ల్ల‌వి, ఈ మూవీ స‌మ‌ర్ప‌కులు డి. సురేష్ బాబు పాల్గొన్నారు. ముందు గోపీచంద్‌, రాశిఖ‌న్నా పాల్గొన్న ఈ షోలో ఈ ఇద్ద‌రు క‌లిసి సుడిగాలి సుధీర్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. చివ‌ర్లో రాశిఖ‌న్నా, సుడిగాలి సుధీర్ క‌లిసి డాన్స్ చేశారు. ఇదే త‌ర‌హాలో గోపీచంద్‌, శ్రీ‌ముఖి కూడా స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నారు.

ఆ త‌రువాత ఎంట్రీ ఇచ్చిన సాయి ప‌ల్ల‌వి, రానా, సురేష్ బాబు నానా హంగామా చేశారు. ప్రోమో షాట్ కోసం రానా ఏసిన పంచ్ లు,,సాయి ప‌ల్ల‌వి డాన్స్ తో అద‌ర‌గొట్టింది. ఆ త‌రువాత సుధీర్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు సాయి స‌ల్ల‌వి దిమ్మ‌దిరిగే పంచ్ ఇచ్చింది.. హౌలేగా అంటాన‌ని చెప్ప‌డంతో సుధీర్ ఫ్యూజులు ఔట్ అయ్యాయి. త‌రువాత నిర్మాత డి. సురేష్ బాబు .. త‌న‌యుడు రానా నాటి కాద‌ని, అంత‌కు మించి అని చెప్ప‌డం.. రానా గాళ్ ఫ్రెండ్స్ గురించి అడిగితే ఒక్క‌రో ఇద్ద‌రో కాద‌ని చాలా మందే వుండి వుంటార‌ని చెప్ప‌డంతో అక్క‌డున్న వాళ్లంతా న‌వ్వుల్లో మునిగిపోయారు. `థాంక్యూ దిల్ సే` పేరుతో రూపొందిన ఈ షో జూన్ 19 ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు జీ తెలుగులో ప్ర‌సారం కానుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.