English | Telugu
నయని కోసం వచ్చిన గాయత్రీదేవి ఆత్మ
Updated : Jun 17, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ 'త్రినయని'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా సాగుతోంది. కన్నడ తారలు అషికా గోపాల్, చందూ గౌడ ప్రధాన జంటగా నటించారు. ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, ప్రియాంక చౌదరి, శ్రీసత్య, భావనా రెడ్డి, చల్లా చందు, అనిల్ చౌదరి, సురేష్ చంద్ర నటించారు. జరగబోయేది ముందే తెలిసి మూడో కంటితో కనిపెట్టే వరం వున్న నయని కథగా ఈ సీరియల్ ని రూపొందించారు.
సైకిల్ రేస్ లో పాల్గొని వచ్చిన రూ. 10 లక్షల ప్రైజ్ మనీని ఓ పాప గుండె ఆపరేషన్ కోసం దానం చేస్తుంది నయని. ఆమె చేసిన పనికి విశాల్ అభినందిస్తాడు. కానీ కసి, వల్లభ మాత్రం చాలా ఓవర్ గా వుందని అంటారు. ఈ విషయం తెలిసిస్తే తిలోత్తమ ఆంటీ ఎలా రియాక్ట్ అవుతుందోనని కసి అంటుంది. అక్కడి నుంచి విశాల్, నయని కలిసి ఇంటికి వెళ్లిపోతారు. సైకిల్ పోటీలో గాయపడిన నయని నొప్పులతో బాధపడుతుంటే విశాల్ ఆ గాయాలకు కాపడం పెడతాడు.
కట్ చేస్తే... చనిపోయిన గాయత్రీ దేవీ ఆత్మ మళ్లీ నయని కోసం వస్తుంది. ఆమెకు మాత్రమే కనిపిస్తూ తన తనయుడు విశాల్ ని చూస్తూ వుంటుంది. ఇదే క్రమంలో ఆత్మ రూపంలో వున్న గాయత్రీదేవి.. నయని సహాయంతో తనయుడు విశాల్ కోసం వంట చేస్తుంది. వండిన వంటని తనయుడు విశాల్ కు తినిపిస్తుంది. అయితే ఆ విషయం విశాల్ కు తెలియకుండా తానే తినిపిస్తున్నానని, కళ్లు మూసుకుని తినమని విశాల్ తో నయని చెబుతుంది. తను చెప్పినట్టే చేస్తూ తింటుంటాడు విశాల్. అయితే చిన్నప్పుడు మా అమ్మ వండి తినిపించిన గోరుముద్దల రుచి నాకు ఇంకా గుర్తుంది అంటాడు. ఆ మాటలతో గాయత్రీ దేవి ఆత్మ భావోద్వేగానికి లోనవుతుంది. ఇంతకీ గాయత్రీదేవి ఆత్మ మళ్లీ ఎందుకొచ్చింది? .. ఏం జరగబోతోంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.