English | Telugu

బాలయ్య డైలాగ్‌తో రెచ్చిపోయిన రోజా!

సరిగమప లిటిల్ చాంప్స్ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. సరిగమప మనది అంటూ సుధీర్ గట్టిగ అనేసరికి హలో అంటూ రోజా స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చింది. అదే గొంతు అంటూ సుధీర్ అక్కడి నుంచి పారిపోయాడు. "అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వను" అంటూ అనంత శ్రీరామ్ డైలాగ్ వేసాడు. "దేనికి నవ్వుతానో దేనికి నరుకుతానో నాకే తెలీదు" అంటూ రోజా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దాంతో సుధీర్, అనిల్ రావిపూడి వామ్మో అంటూ నవ్వారు. ఇక శ్రీనివాస రెడ్డి విజిల్ వేసాడు.

ఇక భగవంత్ కేసరి పోస్టర్ చూపిస్తూ ఒక చిన్నారి బాలయ్య గెటప్ లో వచ్చి అనిల్ దా కేక్ కట్ చేద్దాం అని పిలిచాడు. అలా అనిల్ రావిపూడి పుట్టిన రోజును స్టేజి మీద అందరూ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. ఇక ఈ షోలో బాగా ఫేమస్ ఐన వరుణవిని వాళ్ళ అమ్మను స్టేజి మీదకు పిలిచారు. "ఒక బిడ్డను కనాలంటే తల్లి యుద్ధం చేయాలి. ఆ బిడ్డను పెంచాలంటే కూడా యుద్ధం చేయాలి. అలాంటి యుద్ధం మీరు రోజూ చేస్తున్నారు" అంటూ షాల్ కప్పి ఒక మొమెంటోని ఇచ్చి వాళ్ళను అనిల్ రావిపూడి సత్కరించాడు. అనిల్ రావిపూడి మాటలకు రోజా ఇంకొంతమంది ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. వరుణవి ఈ షోలో ఒక చిచ్చర పిడుగు. పాటలు అద్భుతంగా పాడుతుంది, మాటలు కూడా అమోఘంగా మాట్లాడుతుంది. దాంతో ఈమెకు జడ్జెస్, ఆడియన్స్ ఫాన్స్ ఇపోయారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.