English | Telugu

Illu illalu pillalu : ప్రేమ పోలీస్ కావాలని నిర్ణయం తీసుకున్న ధీరజ్.. రామరాజు ఆన్ ఫైర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -319 లో.... ప్రేమ ఇదివరకు డ్యాన్స్ క్లాస్ చెప్తుంటే.. వాళ్ళ నాన్న ఆడపిల్ల కష్టంతో బ్రతుకుతున్నావని మావయ్య గారి చొక్కా చింపేశాడు మర్చిపోయారా అని శ్రీవల్లి జరిగింది గుర్తుచేస్తుంటే ఇక ప్రేమ పోలీస్ అవ్వడం వద్దని రామరాజు నిర్ణయం తీసుకుంటాడు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను నాన్న.. ప్రేమ ఖచ్చితంగా పోలీస్ అవుతుందని ధీరజ్ చెప్తాడు. దాంతో రామరాజు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత హమ్మయ్య నేను అనుకున్నది జరిగిందని శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే తన పుట్టింటికి వెళ్లి అసలు విషయం చెప్తుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ డల్ గా ఉంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. ఎందుకురా నా కోసం మీ నాన్నతో గొడవపడుతున్నావని ప్రేమ అడుగుతుంది. ఎందుకంటే నీ కల.. నెరవేర్చడం భర్తగా నా బాధ్యత అని ధీరజ్ అంటాడు. అదంతా నర్మద వింటుంది. ఒకప్పుడు నేను జాబ్ గొడవలు అవుతాయి వద్దని అన్నాడు.. ఇప్పుడు నా కోసం వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నాడని ప్రేమ అంటుంది. దాన్నే ప్రేమ అంటారని, ధీరజ్ నిన్ను ప్రేమిస్తున్నాడని నర్మద చెప్తుంది.

ఆ తర్వాత రాత్రి అందరు కబుర్లు చెప్పుకుంటూ అరుబయట కూర్చుంటారు. అప్పుడే సేనాపతి పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వస్తాడు. ప్రేమని పిలుస్తాడు. నాకు కొడుకు పుట్టినప్పటి కంటే కూతురు పుట్టిందని చాలా హ్యాపీగా ఫీల్ అయినా కానీ ఇలా తండ్రికి వెన్నుపోటు పొడుస్తావనుకోలేదని సేనాపతి ఎమోషనల్ అవుతుంటే.. ప్రేమ బాధపడుతుంది. తరువాయి భాగంలో ప్రేమ బాధపడుతుందని ఇంట్లో అందరు ప్రేమ చుట్టూ చేరి డ్యాన్స్ చేస్తూ తనని నవ్వించడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.