English | Telugu

రాకేష్ ముద్దుతో రోహిణి షాక్! రిహార్స‌ల్స్‌లో లేని సీన్ స్టేజ్ మీద‌!!

'జబర్దస్త్'లో అబ్బాయిలు లేడీ గెటప్స్ వేసినన్ని రోజులు ఎటువంటి విచిత్రాలు చోటు చేసుకోలేదు. లేడీ గెటప్స్ కాకుండా డైరెక్టుగా అమ్మాయిలతో యాక్ట్ చేయించడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఛాన్స్ దొరికిందని అమ్మాయిలకు అబ్బాయిలు ముద్దులు పెట్టేస్తున్నారు.

రీసెంట్‌గా ఒక స్కిట్‌లో వర్ష చేతిని భాస్కర్ ముద్దాడాడు. వెనుక ఉన్న ఇమ్మాన్యుయేల్ 'ఇందుకేనా భాస్కర్? గొడవ పడి మరీ టీమ్‌ను మార్చింది?' అని అడిగాడు. స్కిట్‌ ప్రాక్టీసులో ముద్దు పెట్టుకోవడం లేదని, స్టేజి మీదకు వచ్చాక చేశాడని ఇమ్మాన్యుయేల్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రాకింగ్‌ రాకేష్ వంతు వచ్చింది. తన టీమ్‌లో రోహిణికి సడన్‌గా ముద్దు పెట్టేశాడు. దాంతో షాక్ అవ్వడం రోహిణి వంతు అయ్యింది.

నెక్స్ట్ 'ఎక్స్ట్రా జబర్దస్త్' ఎపిసోడ్‌లో ఉద్యోగం కోసం భార్యభర్తలు కాపోయినా భార్యాభర్తలుగా నటించే జంటగా రోహిణి, రాకేష్ నటించారు. భార్యాభ‌ర్త‌లైన వాళ్ల‌కు త‌న ఆఫీసులో ఉద్యోగ‌మిస్తాన‌ని రాజ‌మౌళి చెప్తే.. ఆ ఇద్ద‌రూ అక్క‌డ‌కు వ‌స్తారు. 'మీరు ఇద్దరు భార్యాభర్తలుగా లేరు' అన్నట్టు రాజ‌మౌళి సందేహంగా చూడ‌టంతో.. రోహిణిని దగ్గరకు తీసుకుని, బుగ్గ‌మీద బుగ్గ‌పెట్టి ముద్దు పెట్టేశాడు. దాంతో రోహిణి అవాక్క‌యిపోయింది. ఆమె ఎక్స్‌ప్రెషన్ చూస్తే స్కిట్ ప్రాక్టీసులో అది లేదని క్లియర్ గా తెలుస్తోంది. కమింగ్ వీక్ ఎపిసోడ్ లో '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ హీరో హీరోయిన్లు చైతన్య, అనన్య స్పెషల్ స్కిట్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.