English | Telugu

వర్షకు ఇమ్మాన్యుయేల్ బినామీ అయితే... లవ్ సునామీ వేరొక‌రా?

ప్రతివారం హైపర్ ఆది స్కిట్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ ఉన్నారు. ఆడియన్స్ మాత్రమే కాదు, ఒక్కోసారి 'జబర్దస్త్'లో జడ్జిలు రోజా, మనోతో పాటు యాంకర్ అనసూయ పగలబడి నవ్వుతుంటారు. ఈసారి పగలబడి నవ్వడం కాదు, తన సీటులోంచి ఎగిరి ఎగిరి మరీ అనసూయ నవ్వింది. ఆమె అంతలా నవ్వింతలా ఆది ఏం చేశాడు? అంటే... ఇమ్మాన్యుయేల్, వర్ష జోడీ మీద చేశాడు.

టీవీలో లేటెస్ట్ హాట్ ఫేవరెట్ జోడీ ఇమ్మాన్యుయేల్, వర్షలదే. వర్ష వేరొకరితో సన్నిహితంగా మెలిగితే తట్టుకోలేని ప్రేమికుడిగా... లేదంటే వర్షకు వేరొకరితో పెళ్ళైతే తట్టుకోలేనివాడిగా ఇమ్మాన్యుయేల్ చేసిన స్కిట్లు అన్నీ హిట్టు. ముఖ్యంగా మొన్నామధ్య ఇమ్మాన్యుయేల్ కి వేరొకరితో పెళ్ళైతే తట్టుకోలేని అమ్మాయిగా వర్షను పెట్టి చేసిన ఒక స్కిట్ తర్వాత 'నిజజీవితంలో ఇమ్మాన్యుయేల్ కి వేరొకరితో పెళ్ళైతే ఏం చేస్తావు?' అని రోజా అడిగారు. అప్పుడు వర్ష చాలా ఎమోషనల్ అయ్యింది. 'కష్టం మేడమ్' అని చెప్పింది. దీనికి హైపర్ ఆది పిచ్చ కామెడీ చేసి పడేశాడు.

తన నెక్స్ట్ స్కిట్ లో అందరికీ టీ-కాఫీలు ఇచ్చే ప్రొడక్షన్ బాయ్ క్యారెక్టర్ ఇమ్మాన్యుయేల్ కు ఇచ్చాడు హైపర్ ఆది. ఇమ్మాన్యుయేల్ స్టేజి మీద‌కు రాగానే 'ఇతను ఇమ్మాన్యుయేల్ కదా! వర్ష వెనుక తిరిగేవాడు' అని రీతు చౌద‌రి అంటే... 'దాని వెనుక తిరిగే ఇప్పుడు టీ టీ అని తిరుగుతున్నాడు' అని ఆది చెప్పాడు. 'ఇతడిని వర్ష డీప్ గా లవ్ చేసిందే' అని మళ్ళీ రీతు చౌద‌రి అంది. 'వీడు బినామీ... అసలు సునామీ ఎవరో తెలియాలి' అని ఆది పంచ్ పేల్చాడు. వర్షకు వేరొక లవర్ ఉన్నాడని ఇన్‌డైరెక్టుగా చెప్పినట్టు అయ్యింది. ఇక, 'కష్టం మేడమ్' స్పూఫ్ వచ్చేసరికి అనసూయ సీటులోంచి లేచి మరీ నవ్వింది. ఫుల్ స్కిట్ టెలికాస్ట్ అయితే ఇంకెలా ఉంటుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.