English | Telugu

సుమ ప్రశ్నకు కోపంతో స్టేజి మీద నుంచి వెళ్లిపోయిన ఆకాష్!

'క్యాష్' ప్రోగ్రాం బుల్లితెర మీద దూసుకుపోతోంది. మార్కెట్ లో ఏ కొత్త మూవీ రిలీజ్ ఐనాఆ టీమ్‌ ఈ క్యాష్ ప్రోగ్రాంకి వచ్చి ఈ స్టేజి మీద ఎంటర్టైన్ చేసి వెళ్లాల్సిందే. ఈ షోకు ఇటీవలే 'పక్కా కమర్షియల్' టీం వచ్చి ఓ రేంజ్ లో సందడి చేసి వెళ్ళిపోయింది. లాస్ట్ వీక్ రిలీజ్ ఐన 'చోర్ బాజార్' టీం లేటెస్ట్ గా క్యాష్ షోకి వచ్చింది. ఈ మూవీలో నటించిన హీరో ఆకాష్ పూరి, హీరోయిన్ గెహ‌నా సిప్పీ, ఆర్టిస్ట్స్ రచ్చ రవి, ఇమ్మానుయేల్ వచ్చారు. అప్పటివరకూ ప్రశాంతంగా సాగిన షో ఒక్కసారిగా హాట్ గా మారిపోయింది. దానికి కారణం సుమ అడిగిన టిపికల్ ప్రశ్న.

'డైరెక్ట‌ర్‌ జీవన్ రెడ్డి, హీరో ఆకాష్ పూరి ఇద్దరిలో ఎవరితో కలిసి సినిమా చేయడం మీకు టాప్ గా అనిపించింది?' అంటూ సుమ ఈ షోలో హీరోయిన్ గెహ‌నా సిప్పీకి ఒక ఫిట్టింగ్ క్వశ్చన్ వేసింది. 'జీవన్ రెడ్డితో చేయడం టాప్ అనిపించింది' అనేఆన్సర్ ఇచ్చింది గెహ‌నా.. "ఈ అమ్మాయికి జీవన్ రెడ్డితో చేయడం నచ్చిందట" అని సుమ గట్టిగా అరిచి మరీ చెప్పేసరికి ఆకాష్ జేబులో చేయి పెట్టుకుని కోపంతో స్టేజి మీద నుంచి వెళ్ళిపోయాడు.వెంటనే గెహ‌నా "ఐ యాం వెరీ సారీ ఆకాష్" అంటూ అత‌ని వెనకాలే వెళ్లింది.

ఇక ఈ షోలో 'క్యాష్ బజార్' పేరుతో సినిమాలో నటీనటులు వాడిన వస్తువులని వేలం వేసి అమ్మేసింది సుమ. "రండి బాబు రండి.. 'మగధీర'లో కాజల్ వాడిన కత్తి, 'ఆర్.ఆర్.ఆర్' లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ వాడిన బల్లెం.. రండి బాబు రండి" అంటూ వేలం పాట పెట్టింది. ఇంతలో ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి వచ్చి బల్లెం కొందామనుకుంటుంది. ఆమె దగ్గరకు రచ్చ రవి వచ్చి "ఎవరిని కొడతావ్?" అని అడిగేసరికి "నన్ను ఎవరైనా కామెంట్ చేస్తే కొట్టడానికి"అని చెప్పింది. 'ఏయ్'..అంటే నీకే ముందుగా నీకే పడతాయ్ అన్న అర్థంలో సుమ ఇమ్మానుయేల్ వైపు వేలు చూపిస్తుంది. ఈ కాన్సెప్ట్స్ తో ఈ వారం ప్రోమో రిలీజ్ అయ్యింది.

ఇంతకు ఆకాష్ కి నిజంగానే కోపం వచ్చిందా? సినిమాల్లో వాడిన వస్తువులను ఎంతకు వేలం వేసి అమ్మింది సుమ? అనే విషయాలు తెలియాలంటే ఈ షో కోసం శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే..

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.