English | Telugu

రాజ‌నందినిని నేనే అంటూ షాకిచ్చిన‌ అను!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం ఎండింగ్ కి చేరుకుంది. శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి ఈ సీరియ‌ల్ ని నిర్మించారు. వ‌ర్ష‌. హెచ్ కె కీల‌క పాత్ర‌లో శ్రీ‌రామ్ వెంక‌ట్ కు జోడీగా న‌టించింది. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, రాధాకృష్ణ‌, అనూషా సంతోష్‌, క‌ర‌ణ్‌, మ‌ధుశ్రీ‌, ఉమాదేవి త‌దిత‌రులు న‌టించారు.

రాగ‌సుధ‌కు వ‌ణుకు పుట్టించిన లాయ‌ర్ అస‌లు ఏం జరిగిందో కోర్టుకు వివ‌రించ‌మ‌ని ఆర్య వ‌ర్ధ‌న్ ని బోన్ లోకి పిలుస్తాడు. దీంతో జ‌రిగింది అంతా చెప్ప‌డం మొద‌లు పెడ‌తాడు ఆర్య‌. రాజ‌నంద‌ని, తాను ప్రేమించి పెళ్లిచేసుకున్నామ‌ని, అది రాగ‌సుధ‌కు ఇష్టం లేద‌ని చెబుతాడు. మా పెళ్లి రోజున ఇంటికి వ‌చ్చిన రాగ‌సుధ మే హైడెన్ సీక్ ఆడుతుండ‌గా మేడ‌పై నుంచి రాజ‌నందినిని తోసేసి హ‌త్య చేసింద‌ని చెబుతాడు. అయితే ఇందంతా విన్న రాగ‌సుథ లాయ‌ర్ క‌ట్టుక‌థ అంటాడు.

వెల్ నెరేటెడ్ స్టోరీ అంటూ హేళ‌న చేస్తాడు. ఇలాంటి క‌థ‌లు కాద‌ని, కోర్డుకు సాక్ష్యాలు కావాల‌ని అంటాడు. రాజ‌నందిని గారిని హ‌త్య చేసింది ఆర్య‌వ‌ర్ధ‌నే అని ఈ ఆస్తి మొత్తం రాగ‌సుధ‌కు మాత్ర‌మే చెందుతుంది అన‌డానికి మా ద‌గ్గ‌ర బ‌ట‌మైన సాక్ష్యం వుంద‌ని చెబుతాడు. అను రాజ‌నందినిగా సంత‌కం పెట్టిన ఆస్తి పేప‌ర్ల‌ని కోర్టుకు స‌మ‌ర్పిస్తాడు. దీంతో ఆ సంత‌కం పెట్టింది నేనే అంటుంది.. అదెలా అంటే రాజ‌నందినిని నేనే కాబట్టి అంటుంది.. దీంతో అంతా ఒక్క‌సారిగా షాక్ అవుతారు. ఆ త‌రువాత ఏం జ‌ర‌గ‌బోతోంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.