English | Telugu

అకౌంట్ లోంచి 20 లక్షలు మాయం

డాకుమెంట్స్ మీద సంతకం చేస్తుంది తులసి. వెంటనే ఒక బ్లాంక్ చెక్ కూడా కావాలని అడుగుతాడు బ్యాంకు ఏజెంట్. సరే అని చెక్ మీద సైన్ చేసి ఇచ్చేస్తుంది కానీ మనసులో మాత్రం ఎందుకో టెన్షన్ పడుతూ ఉంటుంది. రేపటిలోగా మీ అకౌంట్ లో 20 లక్షలు డిపాజిట్ అవుతాయి చూసుకోండి అనేసి వెళ్ళిపోతాడు. నందుని కలవడానికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి షాక్ అవుతాడు. వెంటనే లాస్య వచ్చి నందు..ఎక్కువగా ఆలోచించకు నేనే రమ్మన్నాను అని చెప్తుంది. రెండు రోజుల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 20 లక్షలు ఇవ్వబోతున్నాం అని చెప్తుంది.

దానికి గాను కొన్ని డాకుమెంట్స్ మీద నందుతో సైన్ చేయించుకుని వెళ్ళిపోతాడు వాళ్ళ ఫ్రెండ్. నందు కోపంతో లాస్య మీద అరుస్తాడు. అభి డబ్బులు లేవన్నాడు కదా మరి నువ్వు డబ్బు ఇస్తానంటున్నావేంటి అంటాడు. డబ్బు గురుంచి టెన్షన్ పడకుండా కూల్ ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది. మరో పక్క అభి ప్రేమ్ వాళ్ళింటికి వెళ్తాడు . సడన్ గా అభిని చూసేసరికి హ్యాపీగా ఫీల్ అవుతాడు. శృతిని చాప తెమ్మని చెప్పి కూర్చోబెట్టాడు. ఏంటి అన్నయ్య ఇలా వచ్చావ్ అనేసరికి సాయం కోసం వచ్చానంటాడు. నేనేం చేయగలను అంటాడు ప్రేమ్. మాట సాయం కావాలిరా అంటాడు అభి. అంకితకు నచ్చజెప్పి తనతో వచ్చేలా చేయాలి అని అడుగుతాడు.

మరో వైపు తులసికి చాలా హ్యాపీగా ఉంటుంది. తులసి ఆనందాన్ని చూసి అంకిత కారణం అడుగుతుంది. ఇరవై లక్షలు బ్యాంకులో పడబోతున్నాయని చెప్తుంది. అంతలోనే అంత డబ్బు డెబిట్ ఐనట్టు మెసేజ్ వస్తుంది. అది చూసి షాక్ అవుతుంది తులసి. ఇంతకు ఏం జరిగిందో తెలియాలంటే ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ లో చూడొచ్చు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.