English | Telugu

కోర్టులో అనుని అడ్డంగా బుక్ చేసిన రాగ‌సుధ‌!

`బొమ్మ‌రిల్లు`లో హీరో సిద్దార్ద్ కి సోద‌రుడిగా న‌టించిన శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి, నిర్మించిన సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఉత్కంఠ‌భరితంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ‌రామ్ వెంక‌ట్ కు జోడీగా వ‌ర్ష హెచ్ కె న‌టించ‌గా, కీల‌క పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత‌, రామ్ జ‌గ‌న్‌, విశ్వ‌మోహ‌న్‌, రాధాకృష్ణ‌, జ్యోతిరెడ్డి, అనూషా సంతోష్‌, క‌ర‌ణ్‌, మ‌ధుశ్రీ‌, ఉమాదేవి, సందీప్ న‌టించారు.

రాగ‌సుధ ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ఆర్య వ‌ర్ధ‌న్ ఆస్తి కొట్టేయాల‌ని అనుని అడ్డం పెట్టుకుని ఆస్తి ప‌త్రాల‌ని కొట్టేస్తుంది. ఈ విష‌యం తెలిసి జెండే అనుపై అరుస్తాడు. చేసింది చాలు... ఆర్య‌ని బ‌య‌ట‌ప‌డేసే దారుల‌న్నీ నీ అమాయ‌క‌త్వంతో మూసేశావు అంటూ సీరియ‌స్ అవుతాడు. కోర్టు టైమ్ అవుతోంది ఇప్ప‌డు ఎలా అని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తాడు. క‌ట్ చేస్తే.. కొట్టేసి ఆస్తి ప‌త్రాలు త‌న వ‌ద్దే వున్నాయ‌న్న థీమాతో రాగ‌సుధ నేరుగా కోర్టుకు వెళుతుంది. పోలీస్ క‌స్ట‌డీలో వున్న ఆర్య వ‌ర్థ‌న్ ని కూడా కోర్టులో హాజ‌రు ప‌రుస్తారు.

ఇదే స‌మ‌యంలో త‌న అక్క రాజ‌నందిని వ్యాపార సామ్రాజ్యం గురించి.. అదే స‌మ‌యంలో ఆర్య ప్రారంభించిన వ్యాపారం గురించి కోర్టులో చెబుతుంది. త‌న‌కు ఆస్తి వ‌ద్ద‌ని త‌న అక్క‌ని హ‌త్య చేసిన ఆర్య వ‌ర్ధ‌న్ కు శిక్ష ప‌డితే చాల‌ని కోరుకుంటుంది. ఆ త‌రువాత త‌ను ఇదంతా ఆర్య వ‌ర్ధ‌న్ వైఫ్ అను స‌హ‌కారంతోనే చేశాన‌ని, తను నాకు అండ‌గా నిల‌బ‌డింద‌ని చెప్పి అనుని తెలివిగా ఇరికిస్తుంది. దీంతో లాయ‌ర్ అనుని విచార‌ణ‌కు బోనులోకి రావాల్సిందిగా కోర‌తాడు. దీంతో అను భ‌యం భ‌యంగానే బోనులోకి వెళుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అనుని రాగ‌సుధ ఎలా బుక్ చేసింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.