English | Telugu
గోపీచంద్‌కు ప్రసాదమిచ్చి పైసలడిగిన సుమ
Updated : Jun 28, 2022
సుమ హోస్ట్ చేసే క్యాష్ ప్రోగ్రాం చూస్తే చాలు టెన్షన్స్ అన్ని పోయి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు ఎవరైనా. అలాంటి ఈ క్యాష్ ప్రోగ్రాం నెక్స్ట్ వీక్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. ఈ ప్రోగ్రాంకి పక్కా కమర్షియల్ మూవీ హీరో గోపీచంద్, మారుతీ, బన్నీ వాస్, శ్రీనివాసకుమార్ వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించారు. కార్యక్రమంలో భాగంగా సినిమా బాగా ఆడాలని పూజ చేయించాం అంటూ పసుపు కుంకుమ ఉన్న ప్లేట్ గోపీచంద్ కి ఇస్తుంది. ప్రసాదం ఇచ్చి "మరి ఇదంతా చేసినందుకు నేను పక్కా కమర్షియల్ అండి మరి డబ్బులు" అని అడుగుతుంది. "మా ప్రొడ్యూసర్ ని అడగండి" అంటూ గోపీచంద్ తప్పించుకుంటాడు.
ఎంత ఖర్చు అయ్యిందో ఫుల్లుగా లెక్కపెట్టుకోవడానికి కేలిక్యులేటర్ కూడా ఇచ్చేశాం లెక్కపెట్టండి అంటూ సుమ ప్రొడ్యూసర్ కి చెప్తుంది. నేను పర్సు మర్చిపోయాను అంటాడు బన్నీవాస్. స్టేజి మీదకు డైరెక్టర్ మారుతి రాగానే అతనికి అలారం అంటగడుతుంది. ఇందాక పూజ చేయించి ప్రసాదం అది ఇచ్చాను ఆ డబ్బు బాకీ వుంది. ఇప్పుడు ఈ అలారం డబ్బులు బాకీ అంటూ మారుతిని అడుగుతుంది. మేం అడక్కుండానే అమ్మేస్తున్నారు.. డబ్బులు ఎలా ఇస్తాం అంటూ కౌంటర్ వేస్తాడు. ఇవి అమ్మే వస్తువులు కావు వెల్కమ్ గిఫ్టులు అంటుంది సుమ. గిఫ్ట్ అని చెప్పి మరీ డబ్బులడుగుతున్నారంటూ గోపీచంద్ మరో కౌంటర్ వేస్తాడు.
తర్వాత వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడిస్తుంది సుమ. "ప్రపంచంలో ఎంత శాతం మంది ఏ టైంలో ఐనా తాగడానికి సిద్ధంగా ఉంటారు" అని ఒక ప్రశ్న అడుగుతుంది. ఇంత తక్కువ అని చెప్పడానికి నోరు రావట్లేదని అంటాడు శ్రీనివాస్. ఐతే ముక్కుతో చెప్పండి అంటూ మంచి పంచ్ డైలాగ్ వేస్తుంది సుమ. మారుతీ గారు మీరేమంటారు అని అడుగుతుంది. జస్ట్ అలా మూత తీసి వాసన చూశానంటే చాలు ఆరోజు క్యాష్ ప్రోగ్రామే అంటాడు నవ్వుతూ. ఆ మాటకు సుమ వెటకారం మొహం పెట్టి అంటే నేను తాగి యాంకరింగ్ చేస్తున్నానని అంటారా క్యాష్ ప్రోగ్రాం అనేసరికి స్టేజి మీద వాళ్లంతా నవ్వేస్తారు. ఇక ఈ పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రేండింగ్ లో ఉంది.