English | Telugu

భర్త గడ్డాన్ని కత్తిరించిన శ్రీవాణి!

శ్రీవాణి బుల్లి తెర మీద ఫేమస్ యాక్టర్. ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఇప్పుడు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అలరిస్తోంది. శ్రీవాణి భర్త విక్రమ్, కూతురు నందిని కూడా స్మాల్ స్క్రీన్ పై అందరికీ పరిచయమే. ఐతే ఇప్పుడు శ్రీవాణి కూతురు నందినికి స్కూల్ ఓపెన్ చేసేసారు. ఐతే నందిని స్కూల్ కి వెళ్లే ముందు వాళ్ళ నాన్నకు ముద్దు పెట్టి వెళ్లడం అనేది అలవాటు. గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్న నాన్న‌ను నందిని ముద్దు పెట్టుకుంది. ఐనా నాన్న లేవడు. కానీ ముద్దు పెట్టుకునేటప్పుడు నందినికి నాన్న గడ్డం అడ్డం వచ్చి గుచ్చుకుంది. అదే విషయం తల్లి శ్రీవాణికి చెప్పింది. "ఎన్ని సార్లు చెప్పినా మీ నాన్న ఆ గడ్డాన్ని కత్తిరించుకోవట్లేదే బాబూ" అంది శ్రీ‌వాణి.

'ఐతే ఒక పని చేద్దాం మనం ఒక సైడ్ గడ్డం తీసేస్తే ఇక తప్పక నాన్న రెండో వైపు తీసేస్తాడు కదా..' అంటూ ఒక ప్లాన్ వేశారు. శ్రీవాణి కత్తెర పట్టుకొచ్చి గడ్డం నెమ్మదిగా చడీచప్పుడు కాకుండా గ‌డ్డం కత్తిరించేసింది. అలా కొంచెం కొంచెం కత్తిరించేసరికి విక్రమ్ కి మెలకువ వచ్చి చూసేసరికి ఏం అర్థం కాలేదు. ఫైనల్ గా వాళ్లిద్దరూ చేసిన విషయం చెప్పేసింది శ్రీవాణి. "నాన్నా.. ఇదంతా అమ్మ పనే నాకేం తెలీదు" అంది నందిని. "నా ప్లాన్ కాదు, నీ కూతురే ఇలా చేయమంది" అని ఇద్దరూ విక్రమ్ నుంచి తప్పించుకున్నారు. నందిని స్కూల్ కి, శ్రీవాణి షూటింగ్ కి జంప్ ఐపోయారు.

ఇక తప్పక జావేద్ సెలూన్ కి వెళ్లి జుట్టుని, గడ్డాన్ని కత్తిరించుకుని మంచి స్టైల్ గా తయారయ్యాడు విక్రమ్. తమ ఫ్యామిలీ ఎప్పుడూ ఇలాగే హుషారుగా ఉంటుంది అని అలాగే నందినికి ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుందని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు విక్రమ్. నందినికి మంచి పేరెంట్స్ దొరికారు అంటూ, సూపర్ ఫ్యామిలీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.