English | Telugu

అక్క‌డ స‌మంత.. ఇక్క‌డ విష్ణు ప్రియ‌..

బుల్లితెర‌పై హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ`. గ‌త కొంత కాలంగా ఈ షో విభిన్న‌మైన కామెడీ స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటూ రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ఈ కామెడీ షో ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ల‌కు ప్రసారం అవుతోంది. ఈ షోలో సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్ త‌మ‌దైన కామెడీ స్కిట్ ల‌తో హంగామా చేస్తున్నారు.

ఇంద్ర‌జ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తాజా ఎపిసోడ్ ని క‌నుమ స్పెష‌ల్ గా డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ షోలో గెట‌ప్ శ్రీ‌ను బెత్తంతో, సుడిగాలి సుధీర్‌ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న తీరు న‌వ్వులు పూయిస్తోంది. ఇక ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ కోసం హీరోయిన్ కామ్నా జ‌ఠ్మ‌లాని ప్ర‌త్యేక అథిగా ఎంట్రీ ఇవ్వ‌డం, సుడిగాలి సుధీర్ ఆమెకు బిస్కెట్ లు వేయ‌డం.. అది గ‌మ‌నించిన ఆటో రాంప్ర‌సాద్ పంచ్ లు వేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

ఇక్ ఇదే షోలో విష్ణు ప్రియ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ర‌చ్చ చేస్తోంది. ఊ అంటావా మావ‌.. ఊహూ అంటావా... అంటూ `పుష్ప‌`లో స‌మంత ఓ రేంజ్ లో హ‌ల్ చ‌ల్ చేసింది. ఆ పాట పాపుల‌ర్ కావ‌డంతో దాన్ని రీక్రియేట్ చేస్తూ చాలా మంది వీడియోలు చేస్తున్నారు. స్టేజ్ ల‌పై పెర్ఫామ్ చేస్తూ హీటెక్కిస్తున్నారు. ఇప్ప‌డు ఈ షోలో ఇదే పాట‌కు యాంక‌ర్ విష్ణ ప్రియ డ్యాన్స్ చేసి షోని హీటెక్కించింది. విష్ణ ప్రియ హోయ‌ల‌కు సుడిగాలి సుధీర్‌, హైప‌ర్ ఆది క్లీన్ బౌల్డ్ అయిపోవ‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ఈ షో ఈ రోజు మ‌ధ్యాహ్నం ప్ర‌సారం కాబోతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.