English | Telugu

కామెడీ స్టార్స్ ధ‌మాకా.. త‌గ్గేదేలే: నాగ‌బాబు

జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ గ‌త కొన్నేళ్లుగా హాస్య ప్రియుల్ని న‌వ్విస్తూ అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ కాస్త `ఎక్స్ ట్రా జ‌బ‌ర్వ‌స్త్‌`గా మారిపోయింది. ఎంట‌ర్‌టైన్ మ‌రింత డోస్ పెంచేసింది. అంతే కాకుండా `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ` కూడా కామెడీ స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటోంది. తాజాగా వీటికి పోటీగా ఓంకార్ `స్టార్ మా` లో స్టార్ట్ చేసిన షో `కామెడీ స్టార్స్‌`. గ‌త కొన్ని నెల‌లుగా హాస్య ప్రియుల్ని ఆక‌ట్టుకుంటూ ప్ర‌తీ ఆదివారం విజ‌య‌వంతంగా దూసుకుపోతున్న ఈ కామెడీ షో ఇప్పుడు పేరు మారిన‌ట్టుగా తెలుస్తోంది.

ఈ షోలో శేఖ‌ర్ మాస్ట‌ర్‌, న‌టి శ్రీ‌దేవి జ‌డ్జెస్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం జ‌రుగుతోంది. ఇక ఈ షోకు యాంక‌ర్ గా ప్ర‌స్తుతం శ్రీ‌ముఖి వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా శ్రీ‌దేవిని త‌ప్పించి ఆ స్థానంలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు జ‌డ్జిగా వ‌చ్చేశారు. ఇక్క‌డి నుంచి కొన్ని కొత్త టీమ్ లు షో లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. తాజాగా ఈ షోకు `కామెడీ స్టార్ ధ‌మాకా` అని పేరుని మార్చేశారు. ఈ షోలో కొత్త‌గా `ఎక్స్ ట్రా జ‌బర్ద‌స్త్`, ఢీ షోల్లో హైప‌ర్ ఆదికి జోడీగా క‌నిపించి ఆ త‌రువాత షో నుంచి అర్థాంత‌రంగా వెళ్లిపోయిన దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా కొత్త త‌ర‌హా కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ఈ షో ఈ నెల 23 నుంచి ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు `స్టార్ మా`లో ప్ర‌సారం కాబోతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని రిలీజ్ చేశారు. వైర‌స్ ఇన్ని వేరియేష‌న్స్ తో వ‌స్తుంటే అంద‌రిని న‌వ్వించే కామెడీ స్టార్స్ ఇంకెన్ని వేరియేష‌న్స్ తో ఎంత అప్‌డేట్ గా ...ఎంత కొత్త‌గా వ‌స్త‌దో.. త‌గ్గేదే లే` అంటూ నాగ‌బాబు డైలాగ్ చెప్ప‌డం... ఇందులో స్కిట్ లు చేసే కంటెస్టెంట్ లు నానా హంగామా చేస్తున్న తీరు ఓ రేంజ్ లో ఈ షోని టాప్ లో నిల‌బెట్టేలా వున్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.