English | Telugu

త్రిషా గారిని పెళ్లి చేసుకుంటా : నోయెల్


సీరియస్ గా చెప్తున్నా ఆరియానా నేను త్రిషా గారిని పెళ్లి చేసుకుంటా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు నోయెల్. రీసెంట్ గా నోయెల్ నటించిన పొట్టెల్ మూవీ రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అలాంటి నోయెల్ ఆరియానా షోకి వచ్చి ఈ కామెంట్స్ చేసాడు. "హీరోయిన్స్ లో ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు" అన్న ప్రశ్నకు నోయెల్ ఇలా అన్నాడు " హీరోయిన్స్ ని పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్ ఉంటుంది..ఎక్కడో షూటింగ్ లో ఉంటారు. ఫోన్ చేస్తే షూట్ లో ఉన్నా కాసేపట్లో చేస్తా అని పెట్టేస్తారు. మంచి వాళ్లందరికీ పెళ్లిళ్లు ఐపోయాయి.

పెళ్లి చేసుకున్నాక వాళ్ళు మనతో ఉంటె బాగుండనిపిస్తుంది...త్రిష గారు రోజు రోజుకూ చాలా అందంగా మారిపోతున్నారు. ఆమెనే పెళ్లి చేసుకుంటా" అని చెప్పాడు. ఇక తర్వాత తన పెళ్లి, డివోర్స్ గురించి చెప్పాడు. డివోర్స్ అయ్యేంత వరకు కూడా అందరూ మన వాళ్ళే అనిపించింది...డివోర్స్ అయ్యాక అంతా మనవాళ్ళు కాదు అనిపించింది..అని చెప్పుకొచ్చాడు. మనం వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు ఎందుకు మన గురించి ఆలోచించరు అని రియలైజ్ అయ్యి ఆ తరువాత చాలా మారా అన్నాడు నోయెల్.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.