English | Telugu
బంగారం అంటే అమ్మాయిలకు పిచ్చి అంటున్న డాక్టర్ బాబు
Updated : Jun 28, 2022
అమ్మాయిలకు బంగారం అన్నా, రకరకాల దుస్తులన్నా చాలా ఇష్టం. ఎన్నున్నా సరిపోవు. లేవు లేవు అంటూనే ఉంటారు. అందుకే ఎప్పుడూ షాపింగ్ పేరుతో అన్ని కొనేస్తూ ఉంటారు. డ్రెస్ మార్చినప్పుడల్లా దానికి సరిపోయే మ్యాచింగ్ జ్యువెలరీ కోసం షాపులన్నీ జల్లెడ పట్టేస్తారు. అందుకే అమ్మాయిలతో ఎవరన్నా షాపింగ్ కి వెళ్లాలంటేనే భయపడిపోతారు. ఎన్ని సార్లు ఎన్ని షాప్స్ కి తిరిగినా వాళ్లకు అలసట అనేదే రాదు. ఇంకా ఎక్కడలేని ఎనర్జీ మాత్రం వచ్చేస్తుంది. ఇలాంటి విషయాల్లో ఇక సెలబ్రిటీస్ గురుంచి చెప్పక్కర్లేదు. ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉండడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, తిరిగే షాపులు లెక్కకు మించి అని చెప్పొచ్చు.ఈ విషయం మీద లేటెస్ట్ గా డాక్టర్ బాబు ఒక వీడియో చేసాడు. నిరుపమ్ భార్య మంజుల కోసం జ్యువెలరీ కొనడం కోసం ఒక షాప్ కి వెళ్లారు. ఇక అక్కడ ఏడు వారాల నగలు కొనిచ్చాడు డాక్టర్ బాబు అది రోల్డ్ గోల్డ్ జెవెల్లరీ అన్నమాట. రకరకాల మోడల్స్ చూసి అటుతిప్పి ఇటు తిప్పి కొనిపించేసుకుంటుంది మంజుల.
సంపాదించేది మీకే కదా మేమేమన్నా జ్యువెలరీ పెట్టుకుంటామా అంటూ మంజులకు కౌంటర్ కామెంట్ వేసాడు. మెడకు మంచి హారం పెట్టి ఎలా ఉంది బరువుగా ఉందా అని మంజులను అడిగేసరికి మాకు బరువు మోయడం అలవాటే ఇది మోయగలిగేంత బరువే అంటుంది. జ్యువెలరీ విషయంలో నిరుపమ్ కి ఇంతకుముందు ఐతే జీరో నాలెడ్జి కానీ ఇప్పుడు నాతో షాపింగ్స్ కి తిరిగి తిరిగి మంచి నాలెడ్జి వచ్చేసింది అంటుంది మంజుల. ఇప్పుడు ఈ ఏడు వారాల నగల వీడియో వైరల్ అవుతోంది. ఇక నిరుపమ్ బుల్లితెర మీద డాక్టర్ బాబుగా అందరికి పరిచయమే. ఇక మంజుల కూడా సీరియల్స్ లో నటిస్తూనే ఉంటుంది. ఇక వీళ్లిద్దరి జంట సూపర్, గుడ్ పెయిర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.