English | Telugu

"ఇంకా ఎందుకమ్మా జైల్లో ఉంచావ్‌"... నిరుపమ్‌ పరిటాల కామెడీ!

నిరుపమ్‌ పరిటాలలో మంచి కామెడీ టైమింగ్‌ ఉంది. ‘కార్తీక దీపం’లో క్యారెక్టర్‌కు తగ్గట్టు ఎమోషనల్‌గా యాక్ట్‌ చేస్తున్నాడు. బయట మాత్రం సీరియల్‌లో తన క్యారెక్టర్‌ పరిస్థితిపై పంచ్‌ డైలాగ్స్‌ వేస్తున్నాడు. ‘కార్తీక దీపం’లో కథానాయకుడు కార్తీక్‌ జైలు పాలైన సంగతి తెలిసిందే. కొడుకును బయటకు తీసుకురావడానికి అమెరికా నుంచి సౌందర్య వచ్చింది. సౌందర్య పాత్రధారి అర్చనా అనంత్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో నిరుపమ్‌ షేర్‌ చేశాడు. దానికి రాసిన క్యాప్షన్‌ చూస్తే... అతడిలో ఫన్నీ యాంగిల్‌ తెలుస్తుంది.

‘అడగకుండానే డాక్టర్‌ని చేశావ్‌. పిలవకుండానే స్టేషన్‌కి వచ్చావ్‌. ఇంకా ఎందుకమ్మా నన్ను లోపల ఉంచావ్‌. అయినా నువ్వు నాకు నచ్చావ్‌’ అని నిరుపమ్‌ పరిటాల ఓ పోస్ట్‌ చేశాడు. ‘నువ్వు నాకు నచ్చావ్‌’లో త్రివిక్రమ్‌ రాసిన కవితను ‘కార్తీక దీపం’లో కార్తీక్‌ సిట్చువేషన్స్‌కు తగ్గట్టు మార్చి రాశాడు. యాక్చువల్లీ, నిరుపమ్‌లో రైటర్‌ ఉన్నాడు. కొన్ని సీన్స్‌కు డైలాగ్స్‌లో సహకారం అందిస్తాడు. ఆ రైటర్‌ను ఇలా బయటకు తీశాడన్నమాట.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.