English | Telugu

నీకు మ్యాటర్ లేదేమో.. కానీ నాకుంది : నయని పావని!

బిగ్ బాస్ హౌస్ లో గత వారం రోజుల నుండి మెగా ఛీఫ్ కోసం ఆడిన టాస్క్ లో అవినాష్ గెలిచాడు. అవినాష్ మెగా చీఫ్ అయ్యాక పొద్దు పొద్దున్నే అందరు కలిసి వేకప్ సాంగ్ కి డ్యాన్స్ వేసి.. గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు.

ఇక ఒక దగ్గర నయని పావని, హరితేజ వారికి కొంత దూరంలో టేస్టీ తేజ, గౌతమ్ కూర్చున్నారు. ఇక అవినాష్, టేస్టీ తేజలకి మధ్య చిన్నగా గొడవపెట్టాలని చూసింది నయని పావని. విష్ణుప్రియ మెగా చీఫ్ గా ఉన్నప్పుడు తేజ నీకు ఎక్కువ పని చెప్పొద్దన్నాడు ఓన్లీ కటింగ్, అవినాష్ కి హెల్త్ బాగోలేదు కదా అన్నాడంటు అవినాష్ తో నయని అంది. అదే విషయాన్ని కొంత దూరంలో ఉన్న తేజని పిలిచి మాట్లాడుతుంది నయని. అక్కడే ఉన్న గౌతమ్ అది విని ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి ఎందుకని అడిగాడు.

ఆ రోజు నువ్వు అవినాష్ కి ఒక కటింగ్ నే చెప్పాలి..హెల్త్ బాలేదు అన్నావ్ కదా అని నయని తేజని అడుగుతుంది. ఖచ్చితంగా తెలియదని తేజ అంటాడు. నేను నీతో అలా ఓన్లీ కటింగ్ ఇవ్వండి అని చెప్పానా అని తేజని అవినాష్ అడుగుతాడు. నేను అలా అనలేదు అన్నట్టుగా తేజ మాట్లాడేసరికి.. అంటే నేనే మాట మారుస్తున్ననా అని తేజపై కోప్పడుతుంది నయని పావని. ఎందుకు చిన్న విషయాన్ని పెద్దగా చేసి గొడవ పడతారని గౌతమ్ అనగానే.. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు గౌతమ్ అని నయని కోప్పడుతుంది. మ్యాటర్ లేకుండా గొడవపడతారని గౌతమ్ అనగానే.. నీకు మ్యాటర్ లేదేమో కానీ నాకుందని నయని అంటుంది. దాంతో మ్యాటర్ లేదని అంటున్నావా అని గౌతమ్ సీరియస్ అవుతాడు. ఇలానే చిన్న ఇష్యూని పెద్దగా చేస్తుంటావని గౌతమ్ అంటాడు. ఇద్దరికి కాసేపు అర్గుమెంట్ జరుగుతుంది. మళ్ళీ కాసేపటికి ఫ్యామిలీ నుండి వీడియో వస్తుంది. అప్పుడు గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నయని, యష్మీ ఇద్దరిలో ఎవరికి వీడియో చూపించాలని అనుకుంటున్నారంటూ బిగ్ బాస్ అడుగగా.. నయని అని గౌతమ్ చెప్తాడు. మరి నయని పావని-గౌతమ్ ల మధ్య జరిగిన ఈ ఆర్గుమెంట్స్ లో ఎవరిది తప్పు? ఎవరిది కరెక్ట్ కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.