English | Telugu

Brahmamudi : భార్య తెలివికి జలస్ ఫీల్ అయిన భర్త.. ఆమెకి గుడ్ న్యూస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -557 లో....మీరు ఇలా ఫూల్స్ అవడానికి కారణం నేనే అని రాహుల్, రుద్రాణిలతో స్వప్న అనగానే వాళ్ళు కావాలనే స్వప్న మాట్లాడిన ఫోన్ కాల్ ని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు గెలిస్తే నాకొచ్చిన నష్టం ఏంటని రుద్రాణి అంటుంది. నష్టం కాదు మా కావ్య ఇప్పుడు సీఈఓ గా సక్సెస్ అయిందంటు వాళ్ళకి ఇంకా కోపం వచ్చేలా స్వప్న మాట్లాడుతుంది. మరొకవైపు అపర్ణ పాలు వేడి చేస్తుంటే ఇందిరాదేవి వస్తుంది. అత్తయ్య ఇన్ని రోజులు తప్పు చేశాను.. మిమ్మల్ని, ఆయనను బాధపెట్టానంటూ ఇందిరాదేవిపై పడి అపర్ణ ఏడుస్తుంది.

ఆ తర్వాత కావ్య టెన్షన్ పడుతుంటే.. ఇందిరాదేవి ఫోన్ చేసి నీకు గుడ్ న్యూస్ అంటూ అపర్ణ సుభాష్ లు కలిసిపోయారని చెప్తుంది. కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మారాల్సింది రాజ్ ఒక్కడే అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు. థాంక్స్ చెప్పాలని కాల్ చేశారు కదా అని కావ్య అనగానే.. ఏం చేసావని ఇలా మాయ చెయ్యడం నీకు అలవాటే కదా అని వెటకారంగా మాట్లాడుతాడు రాజ్. దాంతో కావ్యకి కోపం వస్తుంది. ఇంకొక సారి నాకు ఫోన్ చేస్తే డిస్మిస్ చేస్తానని కావ్య అంటుంది.

ఆ తర్వాత అనామిక కోపంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుండి కావ్య లాంటి తెలివైన వాళ్ళను చూడలేదని సామంత్ అనామికపై కోపంగా ఉంటాడు. కావ్యని ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు అంతకు రెట్టింపు లాభం తెస్తానది బంధానికి లొంగి పోయే మనిషి దానిపై దెబ్బ కొట్టాలని అనామిక అంటుంది. మరొకవైపు ఇందిరాదేవి, సీతారామయ్య ఇద్దరు కావ్య గురించి గొప్పగా మాట్లాడుతుంటే.. రాజ్ జెలస్ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వద్దని వెళ్లిన క్లయింట్స్ అందరు రాజ్ కి ఫోన్ చేసి.. మళ్ళీ మీ కంపెనీతో డీల్ పెట్టుకోవాలి అనుకుంటున్నాం.. కావ్య మేడమ్ తో అప్పాయింట్మెంట్ ఇప్పించండి అని అంటారు. తరువాయి భాగంలో కావ్య దగ్గరికి రాజ్ వచ్చి వెళ్లిన కంపెనీలు అన్ని మళ్ళీ వచ్చాయని అనగానే.. వెళ్లిన వాళ్ళు వద్దని అంటుంది. ఆ తర్వాత రాజ్ ని వాళ్లతో మీటింగ్ అరెంజ్ చేయమని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.