English | Telugu

Nayani Pavani:  హౌస్ లో ఆ అయిదుగురు డమ్మీ.. ముగ్గురే బెస్ట్!

బిగ్ బాస్ సీజన్-8 లో తొమ్మిదో వారం నయని పావని‌ ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో తొమ్మిదో వారం అరుగురు నామినేషన్లో ఉండగా వారిలో నుండి ఒక్కొక్కరిని‌ సేవ్ చేయగా.. హరితేజ, నయని పావని చివరి వరకు వచ్చారు.

హరితేజ, నయని పావని ఇద్దరిని యాక్షన్ రూమ్ కు పిలిపించి.. రెండు గ్లాస్ లని బ్రేక్ చేయమనగా.. నయని పావని ఎవిక్టెడ్ అని రాసి ఉండడంతో నయని యూ ఆర్ ఎవిక్టెడ్ అని నాగ్ చెప్పేశాడు.‌ ఇక అందరితో మాట్లాడి హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఇక స్టేజ్ మీదకి వచ్చిన నయనిని హౌస్‌లో ఐదుగురు డమ్మీ ప్లేయర్లు ఎవరో చెప్పాలంటూ నాగార్జున అడిగాడు. దీంతో గంగవ్వ పేరు మొదటిగా చెప్పింది. వయసు రీత్యా గంగవ్వ ఆడలేకపోతున్నారు.. కనుక డమ్మీ అని నయని అంది. ఆ తర్వాత రోహిణి పేరు చెబుతూ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి.. గేమ్స్ పరంగా ఇంకా బాగా ఆడాలంటూ సలహా ఇచ్చింది. తర్వాత ప్రేరణ పేరు చెప్పి నీ కోపం వల్ల కొన్ని మాటలు వచ్చేస్తున్నాయ్.. అవి చూసుకమంటూ నయని చెప్పింది. తర్వాత గౌతమ్ గురించి చెప్తూ.. మనం ఒకరి దగ్గరి నుంచి ఏమైనా కోరుకుంటే మనం కూడా అది ఇవ్వాలంటూ నయని చెప్పింది. చివరిగా విష్ణుప్రియ కూడా డమ్మీనే కానీ నువ్వు ఇంకా గేమ్ బాగా ఆడగలవ్ ఆడాలి అంటూ నయని చెప్పింది.

ఇక హౌస్ లో ఏ ముగ్గురు బెస్ట్? ఎందుకో తగిన కారణాలు చెప్పాలంటూ నాగార్జున అడిగాడు. దీనికి ముందుగా హరితేజ బెస్ట్ అంటూ నయని చెప్పింది. నీలో ఉన్న ఫైర్ నువ్వు నమ్మాలి.. ఇంకా బాగా ఆడాలక్కా అంటూ నయని అంది. తర్వాత నిఖిల్.. పేరు చెప్పి ఒక్కోసారి కోపంగా, ఆవేశంగా కనిపిస్తాడు కానీ తన చాలా స్వీట్..తన లోపల ఓ చిన్న పిల్లోడు ఉన్నాడంటూ నయని పొగిడింది. ఇక చివరిగా పృథ్వీ పేరు చెప్పేసింది. హౌస్‌లో నాకు జెన్యూన్ అనిపించిన ఒకే ఒక్క కంటెస్టెంట్ పృథ్వీ.. నువ్వు ఇలానే ఉండు.. నీ మాట మీదే నువ్వు నిలబడు అంటూ నయని చెప్పింది. అలానే చివరిలో పృథ్వీ చాలా నాటీ అంటూ నయని అనడంతో విష్ణుప్రియ ఫేస్ కాస్త ఛేంజ్ అయింది. మొత్తానికి ఇలా హౌస్ నుండి నయని పావని ఎలిమినేషన్ అయి బయకు వచ్చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.