English | Telugu

బిందు మాధ‌వి పిచ్చి మొత్తం బ‌య‌టికి తీస్తాడ‌ట‌!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ మొత్తానికి ఎండింగ్ కి వ‌చ్చేసింది. సీజ‌ప్ ఎండింగ్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న కొద్దీ ఒక్కొక్క‌రి అస‌లు రూపం.. అసలు క్యారెక్ట‌ర్స్ మొత్తం బ‌య‌టికి వ‌చ్చేస్తున్పాయి. గ‌తంలో బిగ్ బాస్ హౌస్ నుంచి త‌న క్యారెక్ట‌ర్ కార‌ణంగానే బ‌య‌టికి వ‌చ్చేసిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఓటీటీ వెర్ష‌న్ లోనే అదే యాటిట్యూడ్ ని ప్రద‌ర్శిస్తూ మ‌ళ్లీ బుక్క‌య్యేలా క‌నిపిస్తున్నాడు. ఏకంగా అఖిల్ కోసం బిందు మాధ‌విని టార్గెట్ చేసి "పిచ్చిది" అంటూ రెచ్చిపోయాడు. ఎవ‌రు అర్హులో ప్రేక్ష‌కులే నిర్వ‌హిస్తార‌ని సీరియ‌స్ గా అంటూ పిచ్చి పిచ్చిగా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లు పెట్టాడు.

నామినేష‌న్స్ లో భాగంగా న‌ట‌రాజ్ మాస్ట‌ర్ పూన‌కం వ‌చ్చిన వాడిలా ప్ర‌వ‌ర్తించి షాకిచ్చాడు. "బిందు మాధ‌వికి ఎమోష‌న్స్ వాల్యూ తెలియ‌దు. పిచ్చి బాగా ముదిరిపోయింది. ఒక్క‌సారి కూడా గేమ్ ఆడకుండా పిచ్చి పిచ్చిగా ఆడుతూ ముందుకు వెళ్తోంది బిందు మాధ‌వి. ఆమె ఫేక్.. ఫేక్.. పిచ్చివాళ్లు క‌రుస్తారు. నిద్ర‌పోతున్న సింహాన్ని లేపారు" అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు న‌ట‌రాజ్ మాస్టర్‌. దీంతో బిందు మాధ‌వి కూడా న‌ట‌రాజ్ మాస్టర్ కు గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చేసింది.

త‌న‌ని టార్గెట్ చేస్తూ 'ఇప్ప‌డు చూపిస్తా' అని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అంటుంటే 'ఇన్ని రోజులు ఎందుకు చెప్ప‌లేదు మాస్టర్?' అంటూ కౌంట‌రిచ్చింది. 'అంటే పిచ్చి ముదిరింద‌ని ఈ రోజే తెలిసింది. నీకు ఎమోష‌న‌ల్ వ్యాల్యూస్ లేవు' అంటూ కించ‌ప‌రిచే విధంగా మాట్లాడాడు. దీంతో బిందు 'మీకు ఒక్క‌రికే కూతురు లేదు, నాకు ఒక్క‌రికే నాన్న లేరు.' అంటుంటే కెమెరా ముందుకొచ్చి 'ఒక్క‌సారి కూడా గేమ్ ఆడ‌లేదు. గేమ్ ఆడ‌కుండా పిచ్చి పిచ్చిగా గేమ్ ఆడుతూ ముందుకు వెళుతున్న బిందు మాధ‌వీ' అన్నాడు. దీంతో బిందు మ‌రింత ఘాటుగా స్పందించింది. 'డైరెక్ట్ గా నా ఎదురుగా మాట్లాడే ద‌మ్ములేక కెమెరా ముందుకెళ్లి మాట్లాడుతున్న న‌ట‌రాజ్ మాస్ట‌ర్' అంటూ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. ఇద్ద‌రి మ‌ధ్య ఇలాంటి సంభాష‌ణ జ‌రుగుతుంటే దాన్ని ఆనందిస్తూ అఖిల్ విక‌టాట్ట‌హాసం చేయ‌డం కొస‌మెరుపు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.