English | Telugu

యశ్, వేదల కథ మళ్ళీ కొత్తగా మొదలవుతోందా ?

బుల్లితెర‌పై ఆక‌ట్టుకుంటున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. ఏడేళ్ల క్రితం స్టార్ ఛాన‌ల్ లో ప్ర‌సార‌మై ఆకట్టుకున్న `ఏ హై మొహ‌బ్బ‌తే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. నిరంజ‌న్, డెబ్జాని మోడ‌క్, నిన్ను నైనిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల‌లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల, మీనాక్షి త‌దిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ తాజాగా కొత్త మ‌లుపు తిరుగుతోంది. దామోద‌ర్ సోద‌రి నిధి.. య‌ష్ ఇంట్లోకి గెస్ట్ గా రావ‌డంతో అస‌లు కథ మొద‌లైంది.

నిధిని వ‌సంత్ కిచ్చి పెళ్లి చేయాల‌ని వుంద‌ని దామోద‌ర్ .. య‌ష్ కు తెలియ‌జేస్తాడు. అందు కోసం నిధిని య‌ష్ ఇంటికి అతిథిగా పంపిస్తాడు. ఇక్క‌డి ఉంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. య‌ష్ కార‌ణంగా వేద ఇంట్లో నిధి గెస్ట్ గా ఎంట్రీ ఇస్తుంది. వ‌చ్చీ రాగానే త‌న అల్ల‌రి తో అంద‌రిని ఆక‌ట్టుకున్న నిధి య‌ష్‌, వేద ఇళ్ల‌ల్లో కొత్త సంద‌డి తీసుకొస్తుంది. అయితే ఇది వేద సోద‌రి చిత్ర కు ఇష్టం వుండ‌దు. ఎలాగైనా నిధిని ఇంటి నుంచి పంపించాల‌ని ఆగ్ర‌హంతో ఊగిపోతూ వ‌సంత్ పై కారాలు మిరియాలు నూరుతూ వుంటుంది.

ఈ క్ర‌మంలోనే వేద‌, య‌ష్ ల జంట మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ లా వుంద‌ని, య‌ష్ కు వేద ల‌భించ‌డం అత‌ని అదృష్టం అంటుంది. వేద ఏంజిల్ లా వుంద‌ని చెబుతుంది. ఈ క్ర‌మంలో వేద ఇంట్లో అంత్యాక్ష‌రి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రోగ్రామ్ లో య‌ష్, వేద క‌లిసి `కన్నులు చెదిరే అందాన్నే వెన్నెల తెర‌పై చూశానే..` అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య కొత్త ప్రేమ మొద‌ల‌వుతుంది. డ్యాన్స్ చేస్తున్న స‌మ‌యంలోనే య‌ష్ .. వేద‌కు ఓ చిట్టి ఇస్తాడు. .జ‌రిగిందేదో జ‌రిగిపోయింది. అదంతా మ‌ర్చిపోదాం. కొత్త‌గా మొద‌లు పెడదాం` అని రాసి వుంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. ఇది నిజ‌మా కలా? అని షాక్ లో వున్న వేద త‌రువాత ఏం చేసింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.