English | Telugu

ఎమోష‌న‌ల్ అయిన ప్ర‌దీప్‌, నందితా శ్వేత‌

ఢీ14.. అబ్బుర పరిచే డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకుంటున్న ఈ షో తాజా ఎపిసోడ్ కొంత మందిని ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసింది. కంటెస్టెంట్ లు చేసిన ఓ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ నందిత శ్వేత‌, యాంక‌ర్ ప్ర‌దీప్ ఒక్క‌సారిగా భావోద్వేగానికి లోన‌య్యేలా చేసింది. క‌న్నీళ్లు పెట్టుకునేలా చేసింది. ఈ షోకు ప్రియ‌మ‌ణి, గ‌ణేష్ మాస్ట‌ర్‌, నందితా శ్వేత న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. యాంక‌ర్ ప్ర‌దీప్ ఈ షోకు యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా హైప‌ర్ ఆది, ర‌వికృష్ణ, న‌వ్య స్వామి టీమ్ లీడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బుధ‌వారం ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. హైప‌ర్ ఆది, ర‌వికృష్ణ ... ఎన్టీఆర్‌, ఏ ఎన్నార్ ల త‌ర‌హాలో కామెడీ చేసి న‌వ్వించారు. అనంత‌రం త‌మ‌ని పెంచి పెద్ద చేసిన త‌ల్లిదండ్రుల‌ను భారంగా భావించే వారికి క‌నువిప్పుక‌లిగేలా ఓ స్కిట్ ని ఈ షోలో ప్ర‌ద‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో త‌న తండ్రిని త‌లుచుకుని న్యాయ‌నిర్ణేత‌ల్లో ఒక‌రైన నందితా శ్వేత కంట‌త‌డి పెట్టుకుంది. ఇటీవ‌ల మ‌ర‌ణించిన త‌న తండ్రి ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది.

మ‌రో వైపు త‌న తండ్రిని త‌లుచుకుని యాంక‌ర్ ప్ర‌దీప్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇక ఇదే షోలో హైపర్ ఆది, ర‌వికృష్ణ `డీజే టిల్లు` పాట‌కు ఎన్టీఆర్‌, ఏ ఎన్నార్ లా స్టెప్పులేసి న‌వ్వించారు. అంతే కాకుండా `నీలి నీలి ఆకాశం` పాట‌ని విచారంగా ఆల‌పించిన హైప‌ర్‌ ఆది అంద‌రిని న‌వ్వించాడు. హైప‌ర్ ఆది ఫ‌న్‌, యాంక‌ర్ ప్ర‌దీప్‌, నందితా శ్వేత‌ల ఎమోష‌న్ లతో నిండిపోయిన ఈ తాజా ఎపిసోడ్ బుధ‌వారం రాత్రి 9:30 గంట‌ల‌కు ఈటీవిలో ప్ర‌సారం కానుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.