English | Telugu

బిందు మాధ‌విని అడ్డంగా బుక్ చేసిన నాగార్జున‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ స‌న్ డే ఫ‌న్ డే కాస్త హాట్ అండ్ హీట్ డేగా మారింది. ప్ర‌తీ ఆదివారం స‌న్ డే ఫ‌న్ డే అంటూ ఎంట్రీ ఇచ్చే నాగార్జున ఈ సండే హౌస్ ని హీటెక్కించాడు. కంటెస్టెంట్ లు ఈ వీక్ లో ఎలాంటి త‌ప్పులు చేశారో ఎండ గ‌డుతూ క్లాస్ పీకే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక ఈ సీజ‌న్ ఓటీటీ ఫ‌స్ట్ వెర్ష‌న్ లో బిందు మాధ‌వి, అఖిల్ ల మ‌ధ్య గ‌త కొన్ని వారాలుగా కోల్డ్ వార్ నడుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్ లో బిందు, అఖిల్ ఒక‌రిని ఒక‌రు విల‌న్ లు గా చిత్రీక‌రించుకుంటూ నిత్యం గొడ‌వ‌లు ప‌డుతూనే వున్నారు. ఇక అఖిల్ స్లాంగ్ ని కించ‌ప‌రుస్తూ `ఆడ‌` అంటూ ఓ రేంజ్ లో ఇబ్బంది పెట్టింది కూడా.

ఆడ అనే ప‌దాన్ని జెండ‌ర్ విష‌యంలో అఖిల్ మీద బిందు మాధ‌వి ప్ర‌మోగించ‌డం, దానికి అఖిల్ ఫీల‌వ‌డంతో బిందు తెలివిగా ఆ టాపిక్ ని ప‌క్క‌దారి ప‌ట్టించి ఎస్కేప్ అయింది. అంతే కాకుండా అందులో జెండ‌ర్ లేదు అంటూ బుకాయించింది కూడా. కానీ నాగ్ ఈ వారం అదే టాపిక్ ని ప‌ట్టుకుని ప‌ద‌కొండ‌వ వారం నామినేష‌న్ లో బిందుని అడ్డంగా బుక్ చేశాడు. న‌ట‌రాజ్ మాస్ట‌ర్, బిందు మాధ‌వి హ‌ద్దులు దాటి గొడ‌వ‌కు దిగారు. ఆడ‌పిల్ల అని న‌ట‌రాజ్ అన్న ప‌దాన్ని బిందు వెంట‌నే అఖిల్ ని ఈ టాపిక్ లోకి తీసుకొచ్చింది.

ఇక్క‌డే నాగ్ కు అడ్డంగా దొరికిపోయింది. ఇదే పాయింట్ ని ప‌ట్టుకుని నాగార్జున .. బిందుని ఇరుకున పెట్టేశాడు. అంతే కాకుండా ఒరేయ్ అన్న డైలాగ్ ని కూడా చూపించి మ‌రి ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నావేంటీ అని గ‌ట్టిగానే క్లాస్ పీకాడు. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ విష‌యంలో ఆడ అంటే అమ్మాయి అంటావు. అఖిల్ విష‌యంలో ఆడ అంటే అమ్మాయి కాదంటారు. ఇందులో ఏదో ఒక స్టాండ్ తీసుకో అని చుర‌క‌లంటించారు నాగార్జున‌.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.