English | Telugu

లిప్‌లాక్ రివ‌ర్స్‌.. ష‌ణ్ముఖ్‌, సిరిలకు నాగ్ క్లాస్!

బిగ్‌ బాస్ ఇంట్లో సిరి హ‌న్మంత్‌, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌ చేసిన ర‌చ్చ బిగ్‌బాస్ షోని విమ‌ర్శ‌ల‌కు గురిచేస్తోంది. న‌టి మాధ‌వీల‌త వీరిద్ద‌రికి సంబంధించిన వీడియోల‌పై ఓ రేంజ్‌లో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం.. అవి నిజ‌మేన‌ని తేల‌డం తెలిసిందే. గ‌త రెండు రోజుల క్రితం బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, ష‌ణ్ణు లిప్‌లాక్ చేసుకోవ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేసింది. ఏంటీ ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతోంది? అని అంతా విస్మ‌యాన్ని వ్య‌క్తం చేశారు.

అయితే కింగ్ నాగార్జున మాత్రం ఇద్ద‌రినీ కన్ఫేష‌న్ రూమ్‌కి పిలిచి క‌డిగిపారేశారు. ష‌ణ్ణుతో పోలిస్తే సిరినే ఎక్కువ‌గా మంద‌లించే ప్ర‌య‌త్నం చేశారు. ఓ ర‌కంగా చెప్పాలంటే సిరి ప‌రువుతీసేశారు. నిన్ను చూసి ఇలా వుండాల‌ని అనుకోవాలే కానీ ... ఇలా వుండ‌కూడ‌ద‌ని అనుకోకూడ‌ద‌ని... గ‌ట్టి క్లాసే పీకాడు. గ‌త కొన్ని రోజులుగా సిరి, ష‌ణ్ణు వ్య‌వ‌హార శైలి నెటిజ‌న్‌ల‌కి, ఆడియ‌న్స్‌కి చిరాకు తెప్పిస్తోంది. ఎందుకు గొడ‌వ ప‌డ‌తారో తెలియ‌దు.. ఆ త‌రువాత ఎందుకు కాంప్ర‌మైజ్ అవుతారో తెలియ‌దు..

దాన్ని అవ‌కాశంగా తీసుకుని టైట్‌గా ఎందుకు హ‌గ్ చేసుకుంటారో తెలియ‌దు. ఇవే అర్థంకాని ప్ర‌శ్న‌లంటే తాజాగా సిరి, ష‌ణ్ణు లిప్‌లాక్.. అది కెమెరా కంటికి చిక్క‌డంతో నానా ర‌చ్చ‌కు దారి తీసింది. దీనిపై సిరి, ష‌ణ్ణుల‌ని శ‌నివారం నిల‌దీశారు నాగార్జున‌. ఎందుకంత‌గా ట్రిప్ అవుతున్నార‌ని చుర‌క‌లు అంటించారు. సిరిని అయితే ఓ రేంజ్‌లో ఏకి పారేశారు. నీలా వుండ‌కూడ‌ద‌ని చుర‌క‌లంటించాడు నాగ్‌. ఆయ‌న‌ చుర‌క‌లు అంటించ‌డంతో సిరి, ష‌ణ్ణులో రియ‌లైజేష‌న్ వ‌చ్చేసింది. కానీ జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయిందని నెటిజ‌న్స్ ష‌ణ్ణు, సిరిల‌పై సెటైర్లు వేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.