English | Telugu

నా కాలు విరిగింది.. నాన్న‌కు హార్ట్ ఎటాక్ వ‌చ్చింది!

శృంగార తార షకీలా 'క్యాష్' షోకి వచ్చారు. స్టేజి మీదకు వచ్చీ రావడంతో యాంకర్ సుమకు ఓ షాక్ ఇచ్చారు. 'ఒక్క స్టెప్ వేయండి. చిన్న డాన్స్ మూమెంట్' అని సుమ అడిగారు. అందుకు 'నేను చేయను. నాకు ముందు ఇవన్నీ చెప్పలేదు' అని సీరియస్ అయ్యారు. కాసేపటికి అది సీరియస్ కాదు... సరదాగా చేస్తున్నారని తెలిసింది. 'నేను చేయను. నా కొడుకు చేస్తాడు' అని చెప్పగా... సంపూర్ణేష్ బాబు వేదిక మీదకు వచ్చారు. సంపూర్ణేష్ బాబు, జ్యోతి, అభినయతో కలిసి షకీలా సందడి చేశారు.

'క్యాష్' అంటే సెలబ్రిటీలతో సుమ చేసే ఎంటర్టైన్మెంట్ హైలైట్. కానీ, ఈసారి కామెడీతో పాటు కన్నీళ్లు కూడా ఉన్నాయని ప్రోమోలో చెప్పారు. షకీలా తల్లితండ్రుల ఫొటోలను 'క్యాష్'లో చూపించారు. తనకు తన తండ్రి అంటే చాలా ఇష్టమని షకీలా చెప్పారు. "మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. సినిమాల్లో నేను పడిన కష్టాలు మా నాన్న చూశారు. ఒక షాట్ లో పైనుండి నేను దూకాలి. డూప్ ఎవరూ లేకపోవడంతో నేను దూకేశాను. కాలు విరిగింది. నాన్నకు ఆ రోజు హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పుడు సినిమాలు చేయవద్దని చెప్పారు" అంటూ షకీలా కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ 'క్యాష్' ఎపిసోడ్ శుక్రవారం టెలికాస్ట్ కానుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.