Read more!

English | Telugu

మోనిత భ‌ర్త‌గా హాస్పిట‌ల్‌లో కార్తీక్‌ని సంత‌కం పెట్ట‌మ‌న్న‌ సౌంద‌ర్య‌!

 

దీపకు కార్తీక్ అన్యాయం చేస్తాడా? ఆస్పత్రిలో మోనిత డెలివరీ ఫామ్ మీద భర్తగా సంతకం పెడతాడా? 'కార్తీక దీపం' సీరియల్ అభిమానుల మదిని తొలిచివేస్తున్న ప్రశ్నలివి. కార్తీక్ వీర్యం ద్వారా మోనిత కృత్రిమ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. తొలుత కార్తీక్ తన భర్త అని, తన కడుపులో బిడ్డకు తండ్రి అని వాదించింది. అసలు నిజాలు బయటపడటంతో జైలుకు వెళ్లింది. గర్భవతి కావడంతో పెరోల్ మీద బయటకు వచ్చింది. 

మోనితకు డెలివరీ టైమ్ దగ్గరపడటంతో నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకు వెళతారు. అయితే, తన భర్తగా కార్తీక్ సంతకం పెడితే తప్ప ఆపరేషన్ చేయించుకొనని మోనిత మొండిపట్టు పడుతుంది. దాంతో కార్తీక్ కి డాక్టర్ భారతి ఫోన్ చేస్తుంది. 'నేనేం చేయాలి. నాకెందుకు చెబుతున్నావ్?' అని కార్తీక్ కోప్పడతాడు. 'నువ్వు వస్తే కానీ ఆపరేషన్ చేయించుకోనని అంటోంది' అని భారతి చెబుతుంది. 'మోనితకు సీరియస్ గా ఉంటే నాకేంటి? బిడ్డ మెడకు పేగు చుట్టుకుంటే నాకేంటి సంబంధం?' అని కార్తీక్ తిడతాడు. కార్తిక్ ఫోనులో మాట్లాడటం విన్న తల్లి సౌందర్య... 'కడుపులో పసిబిడ్డ చేసిన తప్పేంటి? చూస్తూ చూస్తూ ఆ పసి ప్రాణాన్ని కళ్ల ముందే అలా ఎలా వదిలేస్తాం' అంటుంది. ఈలోపు దీప వస్తే టాపిక్ మారుస్తారు. దాంతో తన దగ్గర ఏదో దాస్తున్నారని దీపకు అర్థమవుతుంది. 

మళ్లీ భారతి ఫోన్ చేయడంతో సౌందర్య లిఫ్ట్ చేస్తుంది. భారతి పరిస్థితి మొత్తం వివరించడంతో కొడుకును తీసుకుని ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. దీపకు తెలియకుండా వెళ్లాలని ఇద్దరూ ప్రయాణం అవుతారు. ఆస్పత్రికి వెళ్తారు. అప్పటికే ఒకసారి 'మోనిత డెలివరీ ఫామ్ మీద సంతకం పెడితే దీపకు అన్యాయం చేసినవాడిని అవుతా' అని కార్తీక్ చెబుతాడు. తల్లి బలవంతం చేయడంతో సంతకం పెడతాడా? భార్యకు అన్యాయం చేస్తాడా? అనేది చూడాలి.