English | Telugu

మోనిత‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన కార్తీక్‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ సీరియ‌ల్ ఈ బుధ‌వారం 1205వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. అంతే కాకుండా గ‌త కొన్ని రోజులుగా చిత్ర విచిత్ర‌మైన ట్విస్ట్‌ల‌తో మ‌లుపులు తిరుగుతున్న `కార్తీక దీపం` ఈ బుధ‌వారం ఎపిసోడ్ హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. మోనిత కొడుకు బార‌సాల కోసం దీప ... మోనిత ఇంట మ‌ళ్లీ వంట‌ల‌క్క అవ‌తారం ఎత్త‌డం తెలిసిందే.

ఇదిలా వుంటే మోనిత ఇంటి ముందు కారు ఆపిన కార్తీక్ `తిరిగి వెళ్లిపోదాం మ‌మ్మీ` అంటాడు. నేను వ‌చ్చింది నా కోడ‌లు దీప కోసం నువ్వు కూడా రావాల్సిందే అంటూ సౌంద‌ర్య భ‌ర్త ఆనంద‌రావుతో క‌లిసి కారు దిగుతుంది. వెంట‌నే కార్తీక్ కూడా దిగేస్తాడు. అక్క‌డే అచేత‌నంగా నిల‌బ‌డివున్న వార‌ణాసిని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి వార‌నాసి ఇక్క‌డున్నావ్ .. దీప వ‌చ్చిందా? అంటాడు. `వ‌చ్చింది డాక్ట‌ర్ బాబు.. అక్క మాట‌లు వింటున్నా.. త‌న చేష్ట‌లు చూస్తుంటే భ‌యంవేస్తోంది` అని చెబుతాడు వార‌ణాసి.

క‌ట్ చేస్తే .. బార‌సాల జ‌రిపించ‌డానికి వ‌చ్చిన పంతులుతో ..`పంతులుగారు ఈవిడే నా భార్య అని కార్తీక్ అన‌డంతో మోనిత‌తో పాటు అంతా షాక్‌కు గుర‌వుతారు. `ఇదేం విడ్డూరం అండీ.. ఈవిడ మీ భార్యా` అవంటాడు పంతులు.. `అవును పంతులుగారు ఈవిడే నా భార్య‌... నా అర్థాంగి` అంటూ దీప భుజంపై చెయ్యివేసి ధైర్యంగా చెబుతాడు కార్తీక్‌. అంతే కాకుండా `ఆమె నా జీవితం.. ఆమె నా ప్ర‌పంచం` అంటాడు. ఆ మాట‌ల‌కు దీప పొంగిపోతూ మోనిత వంక పెద్ద పెద్ద క‌ళ్ల‌తో ఉరిమి చూస్తుంది.

ఈవిడ మీ భార్య అయితే మ‌రి ఆవిడ ఎవ‌రు? అని మోనిత‌ని చూపిస్తాడు పంతులు. `మంచి ప్ర‌శ్న వేశారు పంతులుగారు` అంటుంది దీప.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. దీప మాట‌ల‌కు మోనిత రియాక్ష‌న్ ఏంటి? దీప , డాక్ట‌ర్ బాబు.. మోనిత‌కు ఎలాంటి షాకిచ్చారు. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ ఖ‌చ్చితంగా చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.