English | Telugu

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. సినిమాగా రాబోతున్న 'కార్తీక దీపం'!

'కార్తీక దీపం' సీరియల్ బుల్లితెర మీద ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సీరియల్‌లో నటించిన దీప అంటే చాలు లేడీ ఫాన్స్ అంతా ఫిదా అయిపోతారు. ఆ పాత్ర‌ను పోషించింది ప్రేమీ విశ్వ‌నాథ్‌. స్వ‌త‌హాగా మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగు భాష నేర్చుకుని, భావం అర్థంచేసుకుని కార్తీక దీపంలో చక్కగా నటించింది. 2017లో ఈ సీరియల్ స్టార్ట్ అయ్యింది. అది మొదలు 2021 వరకు ఈ సీరియల్‌ రేటింగ్స్ లో టాప్ మోస్ట్ గా నిలబడింది.

ఈ మధ్య కాలంలో ఎన్ని సీరియల్స్ వచ్చినా వంటలక్క సీరియల్ ని బీట్ చేయలేకపోయాయి. తరవాత సీరియల్ నుంచి వంటలక్కను, డాక్టర్ బాబుని తప్పించేసరికి ఒక్కసారిగా రేటింగ్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆపేసిన క్యారెక్టర్స్ ని ప్రవేశపెట్టారు. దాదాపు ఐదేళ్లుగా బుల్లితెర మీద అన్ని సీరియల్స్ లోకి తిరుగులేని రారాణిగా నిలిచిన'కార్తీకదీపం' ఇప్పుడు వెండితెరపైకి వచ్చేందుకు సిద్దమయ్యింది.

ఇప్పుడు ఈ సీరియల్ క్రేజ్ ని కాష్ చేసుకోవడం కోసం మేకర్స్ రెడీ అవుతున్నారట. అదే 'కార్తీక దీపం' మూవీగా రాబోతోందనే విషయం ఇండస్ట్రీలో, ఆడియన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సీరియల్ లో కొన్ని ఇంటరెస్టింగ్ సీన్స్ ని మూవీ రూపంలో తీసి ఫేమస్ ఓటిటి ప్లాట్ఫారంలో ప్రసారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఐతే ఈ వార్తలు నిజమేనా? లేదా కార్తిక్, దీపతో కలిసి మూవీ ఏమన్నా తీయబోతున్నారా? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.