English | Telugu

Karthika Deepam2 : దీపకి సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన కార్తీక్.. జ్యోత్స్న ఎత్తుగడ అదేనా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -381 లో.... శౌర్యకి సుమిత్ర తన చిన్నపటి వస్తువులు ఇచ్చినందుకు రాద్దాంతం చేస్తుంది. దాంతో జ్యోత్స్నపై సుమిత్ర, దశరథ్ కోప్పడతారు. ఈ వస్తువులు నాకు అవసరం లేదని జ్యోత్స్న విసిరేస్తుంటే.. నాకు అవసరమంటు ఆ వస్తువులు అన్నింటిని కార్తీక్ తీసుకొని వెళ్తాడు.

వాళ్లలో ఏదో మార్పు కన్పిస్తుంది.. కార్తీక్ మాటలు తేడా ఉన్నాయ్.. దీప అయితే మనిషే మారిపోయిందని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. అసలు సుమిత్ర, దశరథ్ లతో నువ్వు ప్రేమగా నడుచుకోవాలి.. అప్పుడే నువ్వు చెప్పింది వాళ్ళు వింటారని జ్యోత్స్నతో పారిజాతం చెప్తుంది. ఆ తర్వాత ఎందుకురా అక్కడికి రమ్మన్నావని కాంచన అడుగుతుంది. నీ కోసం.. ఇంకా దీప కోసం.. ఆ ఇల్లు నీకు పుట్టిల్లు.. అదెప్పుడు దూరం కాకూడదు.. అందుకే దగ్గర చేసే ప్రయత్నం అని కార్తీక్ అంటాడు. మరీ దీప కోసం అన్నావని కాంచన అనగానే.. తనకి కూడా పుట్టిళ్లే కదా అని కార్తీక్ అనగానే అందరు షాక్ అవుతారు. అంటే దీప ఇక్కడికి వచ్చాక అక్కడ ఉంది కదా అని కార్తీక్ కవర్ చేస్తాడు. ఎప్పటిలాగే అందరం కలిసి ఉండాలని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత దీప నిద్రపోతుంటే కార్తీక్ వచ్చి.. అనసూయ గారు వెళ్లిపోతున్నారంటూ బయటకు తీసుకొని వస్తాడు. తీరాచూస్తే బెలూన్ డెకరేషన్ కేక్ ఉంటుంది. కార్తీక్ సర్ ప్రైజ్ గా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకని దీప అంటుంది. కానీ నాకు సంతోషమని కార్తీక్ అంటాడు. దీప కేక్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.