English | Telugu

గంగ పుట్టిరోజు వేడుకకు వాళ్ళ అమ్మని తీసుకొచ్చిన పెద్దసారు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -62 లో.....గంగని తీసుకొని రుద్ర ఇంటికి వస్తాడు. గంగ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అందరు తనకి బర్త్ డే విషెస్ చెప్పి సర్ ప్రైజ్ చేస్తారు. దాంతో గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు వెళ్లి రెడీ అయి రా.. తర్వాత కేక్ కట్ చెయ్యాలని పెద్దసారు చెప్తాడు. గంగ లోపలికి వెళ్తుంది.

గంగ పుట్టినరోజు వేడుకలు గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీ చూడాలని లక్ష్మిని పెద్దసారు ఎవరు చూడకుండా ఇంటికి పిలుస్తాడు. పైడిరాజు వస్తుంటే లక్ష్మీ ఎదరుపడుతుంది. నా భార్య అని కళ్ళు నులముకొని చూసేలోపే లక్ష్మీ దాక్కుంటుంది. నా భ్రమ అయి ఉంటుందని పైడిరాజు అనుకుంటాడు. ఎందుకు వచ్చావని పెద్దసారు కోప్పడతాడు. మందుకి డబ్బు నా కూతురు దగ్గర తీసుకుందామని అని పైడిరాజు అనగానే.. ఇప్పుడు వెళ్లి గంగ దగ్గర ఏం వాగుతాడో ఏంటోనని పెద్దసారే పైడిరాజుకి మందుకి డబ్బు ఇచ్చి పంపిస్తాడు.

ఆ తర్వాత లక్ష్మీని పిలిచి నువ్వు ఎవరు చూడకుండా ఆ కిటికీ దగ్గర నిల్చొని చూడు.. గంగ కేక్ కట్ చేసేది కనిపిస్తుందని పెద్దసారు అంటాడు. మరొక వైపు ఇంట్లో వాళ్లంతా బెలూన్ లతో డెకరేషన్ చేస్తారు. గంగ బర్త్ డే అని ముందే తెలిసి ఉంటే గిఫ్ట్ తీసుకొని వచ్చేవాళ్ళమని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. అసలు రుద్ర అన్నయ్య తనని షాపింగ్ కి తీసుకొని వెళ్లి డ్రెస్ కొనివ్వడమే పెద్ద గిఫ్ట్ అని వంశీ అంటాడు. గంగ రెడీ అయి వచ్చి కేక్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.