English | Telugu

కళ్యాణ్ కుట్ర.. వాళ్ళిద్దరి ఫోటోని చూసేసిన రామరాజు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -269 లో..... కళ్యాణ్ తన ఫ్రెండ్ కి పెన్ డ్రైవ్ ఇచ్చి రామరాజుకి ఇవ్వమని చెప్తాడు. అతను రామరాజు కి ఇచ్చి వెళ్తాడు. ఇందులో ఏముందని తిరుపతిని అడుగుతాడు రామరాజు. అది లాప్ ట్యాప్ లో పెట్టి చూడాలని అతను అంటాడు. పక్కనున్న అబ్బాయి దగ్గర లాప్ ట్యాప్ తీసుకొని పెన్ డ్రైవ్ అందులో పెట్టి చూస్తారు. కరెక్ట్ టైమ్ కి ధీరజ్ వచ్చి అవి నా ఎగ్జామ్ రిజల్ట్స్.. అవి చూసి మీరు నన్ను తిట్టాలని.. నా ఫ్రెండ్స్ ఇలా చేశారని ధీరజ్.. ఆ పెన్ డ్రైవ్ తీసుకుంటాడు.

ఆ తర్వాత ప్రేమ ఫ్రెండ్స్ ప్రేమ దగ్గరికి వచ్చి.. నీతో పక్కనున్న అబ్బాయి ఎవరు.. ఫోటో బ్లర్ లో ఉంది.. త్వరలో రివీల్ చేస్తామని చెప్తారు. దాంతో ప్రేమ టెన్షన్ పడుతుంది. మరొకవైపు భాగ్యం, ఆనందరావుని శ్రీవల్లి కలిసి ప్రేమ విషయం చెప్తుంది. ఎలాగైనా అసలు విషయం కనిపెట్టాలని శ్రీవల్లి వాళ్ళతో చెప్తుంది. మరొకవైపు ప్రేమ ఎందుకో టెన్షన్ పడుతుందిరా అని తిరుపతితో రామరాజు అంటాడు.

మరొకవైపు ధీరజ్ కి ప్రేమ ఫోన్ చేసి కళ్యాణ్ నా జీవితం నాశనం చెయ్యాలని చూస్తున్నాడని చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడకు.. నేను వాడి గురించి వెతుకుతున్నానని ధీరజ్ అంటాడు. మరొకవైపు రామరాజు ఇంటికి వస్తాడు. శ్రీవల్లి తన దగ్గరున్న కొరియర్ రామరాజుకి ఇవ్వాలని ట్రై చేస్తుంది. రామరాజుకి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. తరువాయి భాగంలో ప్రేమ, కళ్యాణ్ ఉన్న ఫోటోని రామరాజు చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.