English | Telugu

మేము ఎలాంటి తప్పు చేయలేదు.. పెళ్లి చేసుకోబోతున్నాం!

ఢీ డాన్సర్ జాను మీద కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. జాను తన మీద వస్తున్న రూమర్స్ కి అలాగే పెళ్లి చేసుకోబోతోందన్న విషయం మీద ఏడుస్తూ కూడా వీడియోస్ చేసింది. ఐతే ఇప్పుడు జాను పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్ దేవగన్ రీసెంట్ గా ఒక వీడియోని రిలీజ్ చేసాడు.

"నేను జానుతో ఉన్న ఫోటోని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఐతే అది నిజమే. నేను జాను ఇష్టపడ్డాం. మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. అందరి అంగీకారం మేరకే పెళ్లి చేసుకోబోతున్నాం. మేము ఎలాంటి తప్పు చేయలేదు. మేము కలిసి బతకాలని అనుకుంటున్నాం. అలాంటి మా మీద రకరకాల కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు మీడియాలో. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్లందరికీ థ్యాంక్యూ సో మచ్" అని చెప్పాడు.

ఆ తర్వాత జాను వచ్చి "నేను ఏదైతే వీడియో చేసానో దానికి చాల మంది బాధపడ్డారు. కానీ మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్లందరికీ థ్యాంక్యూ సో మచ్. కొద్దీ రోజులుగా అన్ని గమనిస్తున్నాను. చివరికి తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా..మా ఫామిలీ ఎక్కడ బాధపడుతుందో అని భయమేసింది అంతేకాని ఎవరికో భయపడి కాదు. నేను అలా భయపడే దాన్నీ ఐతే ఈ స్టేజికి వచ్చేదాన్ని కాదు. నేను నా బాబు హ్యాపీగా ఉన్నాం. నా మీద ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. ఎవరు ఎన్ని అనుకున్నా నేను నా లైఫ్ లో ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉన్నాను, ఉంటాను" అని చెప్పింది.

ఇక జాను ఏడుస్తూ చేసిన వీడియోస్ చాలా వైరల్ ఐపోయాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 1 .5 మిలియన్స్ కి చేరిపోయారు. ఇక నెటిజన్స్ ఐతే ఆ జంటకి విషెస్ చెప్తూ మెసేజెస్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.