English | Telugu

Illu illalu pillalu : పూజలో వారిని అవమానించిన భాగ్యం.. ధీరజ్ కి ప్రేమ దగ్గరవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -149 లో... భాగ్యం కావాలనే ప్రేమని అవమానించాలని కాఫీ కింద పడబోసి ప్రేమ చేత క్లీన్ చేయిస్తుంది. అప్పుడే ధీరజ్ వచ్చి ప్రేమని ఆపుతాడు. ప్రేమ తన పుట్టింట్లో చాలా అపురూపంగా పెరిగింది. తనకి ఇలాంటి పనులు తెలియదని ధీరజ్ అంటాడు. అంటే అల్లుడు గారు టీ కింద పడిపోయింది అందుకే అని భాగ్యం అంటుంది. సరే నేనే చేసుకుంటానని ధీరజ్ క్లీన్ చేస్తుంటాడు. అలా ధీరజ్ క్లీన్ చేస్తుంటే తన వంక తన భార్య ప్రేమ ఆప్యాయంగా చూస్తుంది.

ఆ తర్వాత సాగర్, నర్మద కలిసి భాగ్యం ఇంటికి వస్తారు. మీరు రాలేదని అనుకున్నా వచ్చారా అని భాగ్యం అనగానే.. బాబాయ్ గారిని పిలవండి అని నర్మద అంటుంది. లోపల ఉన్నారు రెడీ అవుతున్నారని భాగ్యం చెప్తుంది. తర్వాత బయటకు వెళ్ళాడని చెప్తుంది. అయితే బాబాయ్ కి వీడియో కాల్ చెయ్ అని నర్మద అంటుంది. అప్పుడే భాగ్యం భర్త ఎంట్రీ ఇస్తాడు. ఆ పిల్ల నన్ను ఇడ్లీ అమ్ముతుంటే చూసిందని భాగ్యం భర్త ఆనందరావు భాగ్యంతో చెప్తాడు. దాంతో భాగ్యం డైవర్ట్ చేసి పూజకి టైమ్ అవుతుందని అంటుంది.

ఆ తర్వాత పూజ మొదలవుతుంది. నర్మద, ప్రేమలని అవమానించాలని భాగ్యం అనుకొని.. తన ఇంటికి వచ్చిన వాళ్లతో అవమానిస్తుంది. వాళ్లకు నల్లపూసలు లేవేంటని వాళ్ళు అడుగగా వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారని భాగ్యం అంటుంది. దాంతో ప్రేమ, నర్మద ఇద్దరు బాధపడుతారు. ఆ విషయం వదిలేయండి అని వేదవతి అంటుంది.

తరువాయి భాగంలో అందరు తిరిగి ఇంటికి వస్తారు. ప్రేమ ధీరజ్ మాత్రం ఆటోలో వస్తారు. ఎందుకు ఆటోలో వచ్చారని రామరాజు అడుగుతాడు. బైక్ రిపేర్ అందుకే అని ధీరజ్ అంటాడు. నీకు బుద్ది ఉందా రిపేర్ చేయించుకొని రావాలి కానీ అలా బైక్ వదిలేసి వస్తారా అని ధీరజ్ పై రామరాజు కోప్పడుతుంటే.. శ్రీవల్లి చూసి నవ్వుతుంది. అలా శ్రీవల్లి నవ్వడం ప్రేమ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.