English | Telugu

శాంతి స్వరూప్ ని ఇటు అల్లు అర్జున్ అటు...విజయ్ దేవరకొండ కొరికారట

శాంతి స్వరూప్ కి ఇంత ఫాలోయింగ్ ఉంటుంది అని అస్సలు జనాలు అనుకుని ఉండరు. ఇంతకు శాంతి స్వరూప్ ఏంటి, ఫాలోయింగ్ ఏంటి అనుకుంటున్నారా. నిజమే రీసెంట్ గా ప్రసారమైన ఫామిలీ స్టార్స్ షో చూస్తే తెలుస్తుంది. యాంకర్ సుధీర్ ని రకరకాలుగా ఆడేసుకున్నారు ఈ షోకి వచ్చిన శ్రీకర్ కృష్ణ, అష్షు రెడ్డి, బులెట్ భాస్కర్, లిరిష అలియాస్ వకీల్ సాబ్ మూవీ సూపర్ విమెన్. ఇక జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ ఐతే మరీను. సుధీర్ శాంతి స్వరూప్ ని స్టేజి మీద పలకరించేసరికి ముద్దు పెట్టడానికి వచ్చేసాడు.

దాంతో సుధీర్ "బాబోయి ఇప్పుడు వద్దు" అన్నాడు. "సిగ్నేచర్ మూమెంట్ ఏదో ఒకటి ఉండాలి కదా" అనేసరికి తర్వాత చేద్దాం అని తప్పించుకున్నాడు సుధీర్. "ఏమిటి ఇందాక నుంచి చూస్తున్నా అందరినీ మిత్రవింద మిత్రవిందా అంటున్నవ్..ఎక్కడ కనబడుతోంది మిత్రవింద. ఎం నాలో కనిపించడం లేదా ఇటు చూడు ఈ వైపు నడుమును విజయ్ దేవరకొండ కొరికాడు, ఆ వైపు నడుమును అల్లు అర్జున్ కొరికాడు" అని చెప్పేసరికి సుధీర్ షాకయ్యాడు. ఇక సూపర్ విమెన్ తో చిట్ చాట్ చేసాడు. "ఏంటి ఈ మధ్య డైటింగ్ చేస్తున్నట్టున్నారు..ఆకలిని ఎలా చంపుకుంటున్నారండి" అనేసరికి "నీ యాంకరింగ్ వీడియోస్ చూసాకే..నేనే కాదు మా వాళ్లందరికీ నీ యాంకరింగ్ వీడియోస్ పంపిస్తున్నా" అంటూ లిరిష కౌంటర్ ఇచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.