English | Telugu

నూకరాజు - పంచ్ ప్రసాద్ కి మధ్య గొడవ...అసలేం జరిగిందంటే ?


శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో నూకరాజుకి, పంచ్ ప్రసాద్ కి పెద్ద గొడవే అయ్యింది. పంచ్ ప్రసాద్ కి ఒంట్లో బాగోనప్పుడు కానీ హాస్పిటల్ లో చేర్పించినప్పుడు కూడా నూకరాజు దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. వాళ్ళతో కలిసి వీడియోస్ చేసి వాటిని యూట్యూబ్ లో పెట్టి పంచ్ ప్రసాద్ కి ఆర్థికంగా కూడా సాయం చేయమని కోరాడు. పంచ్ ప్రసాద్ కి నూకరాజు ఒక బ్యాక్ బోన్ లా ఉండి ఎంతో సాయం చేసాడు. ఇక కోలుకున్నాక కూడా నూకరాజు, ప్రసాద్ కలిసి మంచి స్కిట్స్ చేస్తున్నారు అటు జబర్దస్త్ లో, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఏమయ్యిందో ఏమో కానీ ఇప్పుడు ఇద్దరి మధ్యా గొడవొచ్చింది. "బేసిక్ గా నూకరాజు నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అసలు అతను నాతో మాట్లాడడం మానేసాడు. ఎందుకు మాట్లాడ్డం లేదో నాకు తెలియాలి" అన్నాడు పంచ్ ప్రసాద్. ఆ మాటలకూ నూకరాజు స్టేజి మీదకు వచ్చి "ఒక మనిషికి దూరంగా ఉంటున్నామంటే అదేంటో నాకు తెలుసు" అన్నాడు. "తెలిసినప్పుడు చెప్పారా అన్నాడు" ప్రసాద్ . "ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడెందుకు ఆ విషయం" అన్నాడు. " హా లేదు లేదు..అందరికీ తెలియాలి ఆ విషయం" అని అన్నాడు.

ఆ వెంటనే ఇద్దరి మధ్య గట్టిగానే మాటల యుద్ధం జరిగినట్టు ప్రోమోలో కనిపిస్తోంది. ఆ సిట్యుయేషన్ అని ప్రసాద్ అంటూ ఉంటె..వద్దు నాకు చెప్పకు అని నూకరాజు..హి విను ముందు అంటూ ప్రసాద్ ఇలా గట్టిగా స్టేజి మీద పోట్లాడేసుకున్నారు. ఇక వీళ్ళను విడదీయడానికి అటు రష్మీ ఇటు రామ్ ప్రసాద్ ఇద్దరూ వచ్చారు. అసలు ఏమయ్యిందో కానీ గట్టిగానే గొడవ జరిగింది. ఇంతకు ఆ గొడవ ఎందుకు జరిగింది ? అసలు నిజమైన గొడవ ? లేదంటే ఫన్నీ కాన్సెప్ట్ ఆ ? ఈ షో చూస్తే కానీ తెలీదు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.