English | Telugu

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముక్కు అవినాష్.. అమ్మాయి ఎవరంటే?..

జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. అనూజ అనే అమ్మాయితో ఇటీవల అవినాష్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న అవినాష్.. తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేశాడు.

జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.. బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో అరియానాతో అవినాష్ క్లోజ్ గా మూవ్ అవడంతో వీరి మధ్య ఎదో నడుస్తుందనే రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, వీరు పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే, ఇద్ద‌రూ వాటిని ఖండించారు. తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ రూమర్స్ ఆగలేదు. అయితే ఇప్పుడు తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలతో ఈ రూమర్స్ కి చెక్ పెట్టాడు అవినాష్.

ఇటీవల నిశ్చితార్థం జరిగినట్లుగా అవినాష్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తనకు కాబోయే భార్యతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. "మ‌న జీవితంలోకి రైట్ ప‌ర్స‌న్ వ‌చ్చిన‌ప్పుడు ఆలస్యం వద్దు. మా కుటుంబాలు క‌లిసాయి. తర్వాత మేము క‌లిసాం. వెంట‌నే ఎంగేజ్‌మెంట్ అయింది. మీరందరూ ఎప్ప‌టి నుండో పెళ్లి ఎప్పుడు? అని అడుగుతున్నారు. నా అనూజ‌ను త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఎప్ప‌టిలానే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను" అని అవినాష్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.