English | Telugu

'ఎక్స్ట్రా జబర్దస్త్' 350 స్పెషల్: కామెడీ వెనుక కన్నీళ్లు!

'జబర్దస్త్' అంటే కామెడీ! చూస్తున్నంతసేపూ హాయిగా నవ్వుకునే బుల్లితెర వినోద కార్యక్రమం! అందులో నటీనటులకు కమెడియన్లుగా గుర్తింపు పొందారు. అయితే, వాళ్ళు కామెడీ చేయడం వరకూ రావడం వెనుక జీవిత ప్రయాణంలో ఎన్ని కన్నీళ్లు ఉన్నాయనేది రాబోయే 'ఎక్స్ట్రా జబర్దస్త్' ఎపిసోడ్‌లో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు.

'ఎక్స్ట్రా జబర్దస్త్'కు ఈ శుక్రవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్‌ చాలా స్పెషల్. ఎందుకంటే... ఈ ప్రోగ్రామ్ మొదలైన 350 వారాలు అవుతోంది. శుక్రవారం ఎపిసోడ్‌ 350వ ఎపిసోడ్. ఈ సందర్భంగా నాటీ నరేష్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను జీవితాలను స్కిట్స్ రూపంలో చూపించారు.

'జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల లైఫ్ జర్నీ స్కిట్' చూసి రష్మీ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకుంది. హైట్ తక్కువ ఉన్నాడని, ఎదగలేదని నరేష్ ఎన్ని అవమానాలు పడిందీ... సుధీర్, శ్రీను తిండి లేక ఎన్ని కష్టాలు పడిందీ చూపించారు. అంతకు ముందు నవ్వించినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఈసారి స్టేజి మీదకు తీసుకొచ్చారు.ఆ ప‌ర్ఫార్మెన్స్‌లు చూసి ర‌ష్మి, సుధీర్ ఏడుపు ఆపుకోలేక‌పోయారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.