English | Telugu

బుల్లితెరపై స్టార్ హీరోల సంగ్రామానికి వేళాయెరా!

కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య చ‌క్క‌ని అనుబంధం ఉంది. అక్కినేని అందగాడిని 'బాబాయ్...' అంటూ నందమూరి కుర్రాడు ఎంతో ప్రేమగా పిలుస్తుంటారు. నిజ జీవితంలో ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ... తెర జీవితానికి వచ్చేసరికి పోటీ తప్పడం లేదు. ఒకవేళ పోటీ వద్దని స్టార్ హీరోలు ఇద్దరూ అనుకున్నా... పోలికలు తీసుకురాకుండా ప్రేక్షకులు ఉండరు. తమ హీరో బాగా చేశాడంటే, తమ హీరో బాగా చేశాడని అభిమానులు చెప్పుకోకుండా ఉండరు. అసలు, పోటీకి కారణం ఏంటనే వివరాల్లోకి వెళితే...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరుడు' షోకి హోస్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఆగస్టు... అంటే ఈ నెలలో జెమినీ టీవీ షో స్టార్ట్ చేస్తోంది. ఇంతకు ముందు మాటీవీ/స్టార్ మా టీవీలో టెలికాస్ట్ అయిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో కాన్సెప్ట్, ఈ 'ఎవరు మీలో కోటీశ్వరులు' కాన్సెప్ట్ ఒక్కటే. టీవీ మారింది కాబట్టి టైటిల్ ను కొద్దిగా మార్చారు. బహుశా... ఈ నెలాఖరు నుండి జెమినీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రారంభం కావచ్చు.

'మీలో ఎవరు కోటీశ్వరుడు' తొలి మూడు సీజన్లకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేశారు. తర్వాత సీజన్ చిరంజీవి చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఎలా చేస్తాడో చూడాలి. అయితే, 'బిగ్ బాస్' రియాలిటీ షో తొలి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రెండో సీజన్ నాని చేశాడు. తర్వాత నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. 'బిగ్ బాస్' ఐదో సీజన్ కూ నాగార్జున హోస్ట్ చేయనున్నారు. సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ కావచ్చని టాక్.

ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన 'బిగ్ బాస్' నాగార్జున చెంతకు వస్తే... నాగార్జున హోస్ట్ గా మొదలైన 'ఎవరు మీలో కోటీశ్వరులు' ఎన్టీఆర్ చెంతకు వచ్చింది. ఎవరు ఎలా చేస్తారనే ఆసక్తి అందరిలో మొదలు కావడం ఖాయం. 'బిగ్ బాస్' హోస్ట్ చేసినవాళ్లలో ఎన్టీఆర్ బెస్ట్ అని ఇప్పటికీ చాలామంది అంటుంటారు. నాగార్జున బాగా చేయలేదని కాదు. ఎన్టీఆర్ స్టయిల్ కి చాలామంది కనెక్ట్ అయ్యారు. నాగార్జున కంటే ఎన్టీఆర్ హోస్ట్ చేయడం కూడా అందుకు ఓ కారణం కావచ్చు.

అలాగే, చిరంజీవి కంటే నాగార్జునకు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' హోస్ట్ గా ఎక్కువ మార్కులు పడ్డాయి. దాంతో ఎన్టీఆర్, నాగార్జున మధ్య కంపేరిజన్స్ వస్తాయి. పైగా, రెండు షోలు రెండు మూడు వారాలు అటు ఇటుగా మొదలు కానున్నాయి. టీఆర్పీ రేటింగ్స్ పరంగా వచ్చే కంపేరిజన్స్ ను తీసి పారేయలేం. సో, బుల్లితెరపై వెండితెర స్టార్ హీరోల సంగ్రామానికి సమయం వచ్చింది. గెట్ రెడీ ఆడియన్స్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.