English | Telugu

అతడి బుగ్గను పూర్ణ అలా కొరికేసింది!

పూర్ణ అలియాస్ షామ్నా ఖాసింకు ఓ అలవాటు ఉంది. ‘ఢీ’లో ఎవరైనా బాగా డ్యాన్స్‌ చేస్తే... ఆమెకు నచ్చేలా చేస్తే... వాళ్లను పిలిచి మాంచి ముద్దు ఒకటి పెడుతుంది. దాన్ని ముద్దు అని కూడా అనలేం. ఎందుకంటే... ఆమె బుగ్గను అదో మాదిరిగా కొరికేస్తుంది కాబట్టి! ఇన్నాళ్లూ ‘ఢీ’లో కంటెస్టెంట్లకు మాత్రమే పూర్ణ ముద్దులు ఇచ్చింది. బుగ్గలు కొరికింది. కానీ, ఇప్పుడు డ్యాన్స్‌ మాస్టర్‌ బుగ్గను కొరికింది.

‘ఢీ’లో కంటెస్టెంట్‌, డ్యాన్స్‌ మాస్టర్‌ కలిసి పర్ఫార్మ్‌ చేసే రౌండ్‌ జరుగుతోంది. మొన్న బుధవారం కొంతమంది డ్యాన్స్‌ మాస్టర్లు, కంటెస్టెంట్లు కలిసి చేశారు. వచ్చే వారం ఇంకొన్ని పర్ఫార్మెన్స్‌లు ఉన్నాయి. అందులో చైతన్య మాస్టర్‌ది ఒకటి. అతను చిన్నపిల్లాడిగా గెటప్‌ వేసి ‘చిన్ని తండ్రీ... నిను చూడగా’ పాటకు పర్ఫార్మ్‌ చేశాడు. పర్ఫార్మెన్స్‌ పూర్తయిన అతడి బుగ్గను పూర్ణ కొరికినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. అసలు పర్ఫార్మెన్స్‌ చేసేటప్పుడు అయితే లవ్‌ సింబల్స్‌ చూపించింది. ఫ్లయింగ్‌ కిస్సులు పెట్టింది.

చైతన్య మాస్టర్‌ పర్ఫార్మెన్స్‌ పూర్తయిన తర్వాత రష్మీ గౌతమ్‌ చెప్పిన డైలాగ్‌ మరో హైలైట్‌ అని చెప్పక తప్పదు. ‘హీరో ఎంత హ్యాండ్సమ్‌ ఉన్నా వాళ్ల పోస్టర్‌ వాల్‌ మీద ఉంటుంది. కానీ, టెడ్డీబేర్‌ ఎప్పుడూ బెడ్‌ మీద ఉంటుంది’ అని రష్మీ ముసిముసిగా నవ్వుతూ చెప్పింది. దానికి చైతన్య చాలా సిగ్గుపడ్డాడు. ఎప్పటిలా నెక్ట్స్‌ ఎపిసోడ్‌లోనూ సుధీర్‌ మీద ఆది, ప్రదీప్‌ వేసిన పంచ్‌ డైలాగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.