English | Telugu

దొంగపెళ్ళి చేసుకున్న వాళ్ళని ఇంట్లోకి రమ్మన్న తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -29... సాగర్, నర్మదల పెళ్లి చేసి ఇంటికి తీసుకొని వస్తాడు ధీరజ్. వాళ్ళని చూసి రామరాజు షాక్ అవుతాడు. ఎదురింట్లో ఉన్నా భద్రవతి కుటుంబం రామరాజు పరువు పోయిందని సంతోషపడుతుంది. ఎంత నమ్మానురా? ఎందుకిలా చేసావ్ ఇంత దైర్యం ఎలా వచ్చిందని రామరాజు అనగానే.. ఆ దైర్యానికి కారణం నేనే అని ధీరజ్ చెప్పగానే తనపై రామరాజు కోప్పడతాడు.

నా పరువు తీసావ్ కదారా.. నువ్వు ఇంట్లో ఉంటే పెద్దోడిని ఇంకా కూతురిని కూడా చెడగొడతావ్.. ఇంట్లో నువ్వు ఉండకూడదు వెళ్ళిపోమని రామరాజు అనగానే.. వద్దు నాన్న ప్లీజ్ తప్పు చేసింది మేము.. శిక్ష వాడికేందుకని సాగర్ అంటాడు. నర్మదని వాళ్ళింట్లో దింపేస్తానని సాగర్ అనగానే.. సిగ్గు లేదా ఆ మాట అనడానికి నిన్ను నమ్మి వచ్చిందని రామరాజు అంటాడు. ధీరజ్ ని ఇంట్లో నుండి పంపిస్తాడు రామరాజు. వద్దని వేదవతి అంటుంది‌. అయిన ధీరజ్ వెళ్ళిపోతాడు.

నిన్ను నమ్మి ఒక అమ్మాయి వచ్చింది. మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తున్నాను కానీ ఎప్పటికి క్షమించలేనని రామరాజు అంటాడు. ఆ తర్వాత భద్రవతి కుటుంబం హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఇన్ని రోజులుగా రామరాజు పరువుపోవడం కోసం చూసామంటూ సేనాపతితో భద్రవతి అంటుంది. తరువాయి భాగంలో రామరాజు ఇంట్లో గొడవలు మొదలవ్వాలి అంటే ఆ పిల్ల పేరెంట్స్ ఎవరో కనుక్కోమని.. వాళ్ళతో మాట్లాడుదామని సేనాపతికి చెప్తుంది భద్రవతి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.