English | Telugu

నగల విషయం తేల్చాలనుకున్న కోడళ్ళు.. వరలక్ష్మి వ్రతం రోజు ఫిక్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు:(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -237 లో..... శ్రీవల్లి ఆడపడుచు కట్నంగా రోల్డ్ గోల్డ్ ఇచ్చిందని కామాక్షి కోపంగా ఇంటికి వస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లిపై కామాక్షి కోప్పడుతుంది. భాగ్యం, శ్రీవల్లి కలిసి ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేస్తారు. ఈ నగలు మా చిన్న కూతురివి దానివి ఇందులో కలిసిపోయినవని భాగ్యం అంటుంది. ఇదేంటమ్మ చీప్ గా నేను ఎయిర్ పోర్ట్ పక్కన రెండు ఎకరాలు నీ పేరు మీద రాయిస్తానని భాగ్యం అంటుంది.

దాంతో కామాక్షి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతే కాదు ఫిబ్రవరి ముప్పై తారీఖున నీకు రిజిస్ట్రేషన్ చేపిస్తానని భాగ్యం అనగానే కామాక్షి మురిసిపోతుంది. తింగరిది కనీసం ఫ్రిబ్రవరి ముప్పై ఉండదన్న విషయం కూడా తెలియదని భాగ్యం నవ్వుకుంటుంది. అదే విషయం కామాక్షి వచ్చి నా పెద్ద మరదలు ఆడపడుచు కట్నంగా ఏం ఇస్తుందో తెలుసా అని చెప్తుంది నర్మద, ప్రేమ వాళ్లకు చెప్తుంది. అదంతా విని.. ఇందులో ఏదో తేడా ఉందని ప్రేమ, నర్మద అనుకుంటారు. నగలు విషయం ఎప్పుడు వచ్చిన అక్క ఎందుకు టెన్షన్ పడుతుంది. విషయం తేల్చాలని అనుకుంటారు

ఆ తర్వాత ప్రేమ, నర్మద రామరాజు దగ్గరికి వచ్చి.. రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటామని అడుగుతారు. అందుకు వేదవతి, రామరాజు సరే అంటారు. ఇందులో వాళ్ళ ప్లాన్ ఏదో ఉందని భాగ్యం, శ్రీవల్లి అనుకుంటారు. ఏ ప్లాన్ అయిన ఎదురుకొడతా అని భాగ్యం అంటుంది. మరొకవైపు రేపు నగల గురించి బయటపడుతుందని ప్రేమతో నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.