English | Telugu

Illu illalu pillalu : రామరాజుని అరెస్టు చేసిన పోలీసులు.. ధీరజ్ నిజం చెప్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -84 లో..... రామరాజుకి ముళ్ళు గుచ్చుకుంటే అందరు నాకు ఆ ముళ్ళు తియ్యరాదు అంటుంటారు. నర్మదా మాత్రం తన కాళ్ళు పట్టుకొని ముళ్ళు తీస్తుంది. నేను ఏదైనా మీ ముందు మాట్లాడే హక్కు ఉందన్న ఆలోచనతో మీకు ఎదురు మాట్లాడాను.. నన్ను క్షమించండి మావయ్య అని రామరాజుతో నర్మద అంటుంది.

అది విన్న వేదవతి మురిసిపోతుంది. రామరాజుకి కూడా తన మాటలు నచ్చుతాయి. కానీ సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చూసారా అత్తయ్య మావయ్య నన్ను క్షమించాడు అంటు నర్మాద వేదవతికి చెప్తుంది. చాల్లే కానీ మీరు ఇప్పుడు గుడికి వెళ్ళండి అంటూ నర్మద, సాగర్ ధీరజ్, ప్రేమ లకి వేదవతి చెప్తుంది. వాళ్ళు సరే అని గుడికి వెళ్తుంటే వేదవతి ఆపి ప్రేమ మెడలో గొలుసు వేస్తుంది. అదంతా భద్రవతి చూస్తుంటే.. చూసావా కొడలు అంటే వేదవతికి ఎంత ఇష్టమో అని పెద్దావిడ అంటుంది. దాంతో భద్రవతి కోపంగా పెద్దావిడని గదిలోకి తీసుకొని వెళ్లి ఒక్క గొలుసు వేస్తేనే ఎంత ఇష్టం అంటున్నావ్ మరి నేను ఎన్ని నగలు చేయించాను.. చూడు అంటూ భద్రవతి నగలు చూపెట్టేసరికి అందులో ఉండవు. వాడు ప్రేమతో పాటు నగలు తీసుకొని వెళ్ళాడంటూ భద్రవతి ఆవేశంగా రామరాజు ఇంటి ముందుకి వచ్చి పిలుస్తుంది.

ఏం బ్రతుకురా.. నీ కొడుకు నా కోడలితో పాటు ఏడువారాల నగలు కూడా తీసుకొని వెళ్ళాడని రామరాజుతో భద్రవతి అనగానే అందరు షాక్ అవుతారు. నా కొడుకు అలా ఎప్పటికి చెయ్యడని రామరాజు అంటాడు. చిన్నోడికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పమని తిరుపతికి రామరాజు చెప్పగానే.. ధీరజ్ కి ఫోన్ చేసి త్వరగా రండీ అని చెప్తాడు. ఆ తర్వాత ధీరజ్ వాళ్ళు వస్తారు. నువ్వు వాళ్ల నగలు తీసుకొని వెళ్ళావా అని రామరాజు అడుగగానే.. ధీరజ్ టెన్షన్ పడుతాడు. తరువాయి భాగంలో రామరాజుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మా అమ్మ నీ గురించి ఆలోచించందుకు మా పరిస్థితి చూసావా.. మీ వాళ్ళు ఏం చేసారో అంటు ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.