English | Telugu

Illu illalu pillalu : రామరాజుకి ఎదురుతిరిగిన కొడుకు.. వాడిని చంపడానికి విశ్వ స్కెచ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -61 లో..... నీ ముద్దుల కొడుకు వల్ల నలుగురిలో పరువు పోయిందని రామరాజు అంటుంటే ధీరజ్ మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దాంతో మాట్లాడకని రామరాజు అనగానే.. నేను మాట్లాడతాను నాన్న.. నలుగురు ఏం అనుకుంటారో అంటున్నారు. ఎవరు ఆ నలుగురు ఇరవై అయిదు సంవత్సరాల క్రితం మీరు అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ నలుగురు మీకు సాయంగా ఉండి.. ఒక పూట భోజనం పెట్టారా.. ఎందుకు నలుగురి గురించి అలోచించడం అని ధీరజ్ అంటుంటే.. రామరాజుకి ఇంకా కోపం వస్తుంది.

చూసావా ఎలా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడోనని వేదవతితో రామరాజు అంటాడు. కాసేపటికి ధీరజ్ బయటకి వెళ్లి బాధపడతాడు. వేదవతి తన దగ్గరికి వెళ్లి.. ఎందుకు మీ నాన్నకి ఎదురు మాట్లాడుతున్నావంటూ అడుగుతుంది. దాంతో దీరజ్ ఎమోషనల్ అవుతూ.. నాన్న బాధపడడానికి కారణం నువ్వు కదా.. ఆ రోజు ప్రేమ మెడలో తాళి కట్టమన్నావ్.. నాన్న గురించి ఆలోచించలేదని ధీరజ్ అంటాడు. ఒక జీవితం నాశనం కాకుండా కాపాడాలన్న ఒక ఆలోచన మాత్రమే నాకు ఉండెనని వెధవతి అంటూ కళ్ళు తిరిగి పడిపోబోతుంటే.. ధీరజ్ పట్టుకొని కూర్చొపెట్టి నీళ్లు తాగిస్తాడు. నువ్వు టెన్షన్ పడకు అమ్మ.. కుటుంబం గురించి నేను చూసుకుంటానని వేదవతితో ధీరజ్ చెప్తాడు.

కాసేపటికి ఊరు పెద్దలు కొంతమంది రామరాజు ఇంటికి.. కొంతమంది భద్రావతి ఇంటికి వెళ్తారు‌. సంక్రాతి ఉత్సవాలకి మీ చేతులు మీదుగా జరగాలి అంటారు. ముందు ఇరు కుటుంబాల వాళ్ళు రామనే అంటారు. చందు చెవిలో వస్తామని చెప్పమని ధీరజ్ చెప్తాడు. దాంతో మేము వస్తామని చందు చెప్తాడు. ఆ తర్వాత విశ్వ కూడా మేము వస్తామని చెప్తాడు. కాసేపటికి ఎందుకు వద్దని భద్రవతి అనగానే.. వాళ్ళ ముందు మనం వెళ్లకుంటే మన పరువుపోతుందని విశ్వ అంటాడు. దాంతో భద్రవతి సరే అంటుంది. ఇప్పుడు మొదలు అవుతుంది ఆట, వేట అని విశ్వ మనసులో అనుకుంటాడు. మరొకవైపు నేను రానని చెప్తుంటే నువ్వెందుకు అలా చెప్పావని చందుతో రామరాజు అంటాడు. వెళదాం బావ అని తిరుపతి అనగానే.. నా మాటకి ఎదరు చెప్పడం వాడికి అలవాటే కదా.. వాడు పెద్దోడి చెవిలో ఏదో చెప్పడం నేను చూసానని రామరాజు అంటాడు.ఎప్పటిలాగే మన కుటుంబంతో కలిసి పండుగ చేసుకోవాలని ధీరజ్ వాళ్ళు అంటారు. తరువాయి భాగంలో ధీరజ్ ని చంపమని రౌడీకి చెప్తాడు విశ్వ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.