English | Telugu

Karthika Deepam2 : కన్నతండ్రినే చంపాలనుకున్న జ్యోత్స్న.. అతనిది యాక్సిడెంట్ కాదని డౌట్ పడ్డ దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -260 లో..... దాస్ ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వస్తారు. ఆ సిచువేషన్ లో దాస్ ని చూసి పారిజాతం ఎమోషనల్ అవుతుంది. నిన్ను ఎవరు కొట్టారో వాళ్ళ చేతులు విరిగిపోను అంటూ పారిజాతం తిడుతుంటే జ్యోత్స్న రియాక్ట్ అవుతుంది. తమలో ఇలాంటి ప్రేమలు కూడా ఉన్నాయా అని జ్యోత్స్నని ఉద్దేశించి కార్తీక్ అంటాడు. మీరు వెళ్ళండి నేను ఉంటానని జ్యోత్స్న అందరిని బయటకు పంపిస్తుంది. మీ నాన్న అంటే ఎంత ప్రేమనే అని పారిజాతం అనుకుంటుంది. అందరిని వెళ్ళమని చెప్పింది నిన్ను చంపెయ్యడానికే అని జ్యోత్స్న అనుకుంటుంది.

అందరు గదిలో నుండి బయటకు వస్తారు. నువ్వు బ్రతికితే నాకు ప్రాబ్లమ్ అని జ్యోత్స్న పిల్లో తీసుకొని దాస్ పై పెట్టబోతుంటే దాస్ కళ్ళు తెరుస్తాడు. దాంతో జ్యోత్స్న భయపడి గట్టిగా అరుస్తుంది. అందరు వస్తారు ఎందుకు అరిచావని అడుగగా.. కళ్ళు తెరిచాడని జ్యోత్స్న చెప్తుంది. ఈ పిల్లో ఏంటి కింద ఉందని స్వప్నకి డౌట్ వస్తుంది. తల కింద పెడదామనుకున్న కానీ కళ్ళు తెరిచేసరికి భయపడ్డాను.. దాంతో అక్కడ పడిపోయిందని జ్యోత్స్న చెప్తుంది. ఇక మేము బాబాయ్ ని మా ఇంటికి తీసుకొని వెళ్తామని జ్యోత్స్న అంటుంది. వద్దని పారిజాతం అంటుంది. నేను నాన్నని ఎక్కడికి పంపనని కాశీ చెప్తాడు. జ్యోత్స్న ని తీసుకొని పారిజాతం వెళ్ళిపోతుంది. దశరత్ తన డాక్టర్ ఫ్రెండ్ కి కాల్ చేసి.. దాస్ ని సేవ్ చేసినందుకు థాంక్స్ చెప్తాడు. అప్పుడే పారిజాతం జ్యోత్స్న వాళ్లు వస్తారు. దాస్ కళ్ళు తెరిచాడని పారిజాతం చెప్పగానే దశరత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.

జ్యోత్స్న టెన్షన్ పడుతుంటే.. తనకి సింక్ అయ్యేలా దశరథ్ మాట్లాడుతుంటాడు. దాంతో జ్యోత్స్న ఇంకా కంగారుపడుతుంది. కార్తీక్, దీప ఇద్దరు అక్కడ నుండి బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. బాబాయ్ ని ఎవరైనా కొట్టారా? ఆక్సిడెంట్ అయిందా? మీరేం అనుకుంటున్నారని కార్తీక్ ని దీప అడుగుతుంది. నేను ఒక అంచనాకి రాలేకపోతున్నానని కార్తీక్ అంటాడు. అప్పుడే కార్తీక్ కి డాక్టర్ ఫోన్ చేసి.. శౌర్య గురించి మాట్లాడానికి స్పెషలిస్ట్ వచ్చాడు రండీ అని చెప్తాడు. దాంతో కార్తీక్ కంగారుగా దీపని ఆటో ఎక్కించి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. కార్తీక్ బాబు ఎందుకు టెన్షన్ పడుతున్నాడని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.