English | Telugu

Illu illalu pillalu : శోభని పట్టుకోడానికి రంగంలోకి దిగిన అత్తాకోడల్లు.. ధీరజ్ బయటకొస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -302 లో..... అసలు ఏం జరిగిందో ధీరజ్ కానిస్టేబుల్ కి చెప్తాడు. అతను వచ్చి నర్మద, ప్రేమకి చెప్తాడు. శోభని కిడ్నాప్ చేసింది తన ఫ్రెండ్స్ అన్నమాట.. ఎలాగైనా వాళ్ళని కనిపెట్టాలని, ధీరజ్ ని బయటకు తీసుకొని రావాలని ప్రేమ. నర్మద అనుకుంటారు. శోభ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి శోభ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ అడిగి తెలుసుకుంటారు.

ఇలా బయటకు వెళ్తున్నామని మావయ్యకి చెప్దామని నర్మద అంటుంది. వద్దు మనల్ని వెళ్లానివ్వరని ప్రేమ అంటుంది. పోనీ అత్తయ్యకి అయిన చెప్దామని ఇద్దరు వేదవతి దగ్గరికి వెళ్లి ఇలా శోభ ఫ్రెండ్స్ ని వెతకడానికి వెళ్తున్నామని చెప్తారు. మీ మావయ్య గారికి చెప్పకుండా ఎలా అని వేదవతి అడుగుతుంది. చెప్తే వెళ్లనివ్వరని ప్రేమ అంటుంది. అయితే మీతో పాటు నేను కూడా వస్తానని వేదవతి అంటుంది. ఇక ముగ్గురు కలిసి వెతకడానికి వెళ్తారు. ధీరజ్ ని ఆ పరిస్థితిలో చూసి రామరాజు ఎమోషనల్ అవుతాడు. బయటకు వెళ్లి టిఫిన్ కొనుక్కొని వచ్చి కానిస్టేబుల్ కి ఇచ్చి ధీరజ్ కి ఇవ్వమని చెప్తాడు.

మరొకవైపు అత్తాకోడళ్ళు కలిసి శోభ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి శోభని తీసుకొని వెళ్లిన వాళ్ళ నెంబర్ తీసుకుంటారు. వాళ్లకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో నర్మద తనకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి లాస్ట్ కాల్ ద్వారా లొకేషన్ ట్రేస్ చెయ్యమని చెప్తుంది. దాంతో వాళ్ళు.. శోభ ఫ్రెండ్స్ వాళ్ళ లొకేషన్ పంపిస్తారు. ఇక అత్తాకోడళ్ళు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.