English | Telugu

Karthika Deepam2: సుమిత్ర, దశరథ్ ల పెళ్ళిరోజున గుడిలో అర్చన‌.‌. ఇద్దరు కలుస్తారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ 501 లో..... సుమిత్ర దేవుడికి మొక్కుకొని వస్తుంటే దశరథ్ కన్పిస్తాడు. దాంతో సుమిత్ర పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ఈ రోజు మా పెళ్లి రోజు మా భార్య రాలేదు.. నా పేరున తన పేరున అర్చన చేయించండి అని పూజారితో దశరథ్ చెప్తాడు.

ఇందాకే ఈ పేరుతో ఎవరో అర్చన చేసారండి అని పూజారి చెప్పగానే.. అవునా సుమిత్ర వచ్చి ఉంటుందా అని దశరథ్ అంటాడు. పేరు ఒకేలాగా ఎంత మందికి ఉండదు మావయ్య అని కార్తీక్ అంటాడు. అవునులే నన్నే వద్దనుకొని వెళ్ళింది.. ఇక పెళ్లి రోజు ఎలా గుర్తు పెట్టుకుంటుందిలే అని దశరథ్ అంటాడు. అదంతా సుమిత్ర వింటుంది. మనిషినే వద్దునుకున్నారు.. మరి మీకేందుకో పెళ్లి రోజు అని సుమిత్ర అనుకుంటుంది. మరొకవైపు మా మమ్మీని ఏం చేసావని దీపని జ్యోత్స్న అడుగుతుంది. నాకు తెలియదని దీప చెప్తుంది. ఇలా చెప్తే ఎందుకు వింటుంది.. ఇన్‌స్పెక్టర్ గారు తనని అరెస్ట్ చెయ్యమని జ్యోత్స్న చెప్తుంది. నా కోడలుని అరెస్ట్ చేస్తే ఊరుకోనని కాంచన అంటుంది. ఆ తర్వాత దీపని పోలీసులు తీసుకొని వెళ్తారు.

మరొకవైపు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని కాశీని స్వప్న అడుగుతుంది. అదేం లేదని కాశీ అనగానే మరెందుకు నాన్న కాళ్ళు పట్టుకున్నావని స్వప్న అడుగుతుంది. దానికి కాశీ ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటాడు. మరొకవైపు సుమిత్ర విషయంలో తప్పు చేసానని దశరథ్ పశ్చాతాప్పడతాడు. అదంతా సుమిత్ర వింటుంది. దశరథ్ బాధని చూడలేక సుమిత్ర తన ముందుకి వస్తుందో లేదో చూడాలి మరి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.