English | Telugu

Illu illalu pillalu : శోభ మిస్సింగ్ కేసులో ధీరజ్ ని తీసుకెళ్ళిన పోలీసులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -300 లో......ముగ్గురు కోడళ్ళు కొడుకులు కలిసి రామరాజు, వేదవతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత మూడు జంటలు పూజపై కూర్చుంటారు. వాళ్ళని అలా చూసి వేదవతి మురిసిపోతుంది. ప్రేమ బ్లౌజ్ కి, ధీరజ్ షర్ట్ ఇరుక్కుంటుంది. దాంతో షర్ట్ కొంచెం చిరుగుతుంది. అది చూస్తే నాన్న ఫీల్ అవుతాడని ధీరజ్ లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత కాసేపటికి ఇంటికి పోలీసులు వస్తారు.

పోలీసులని చూసి అందరు బయటకు వస్తారు. ఏమైందని అడుగుతారు. ధీరజ్ అంటే ఎవరు అని ఇన్‌స్పెక్టర్ అడుగుతాడు. అసలు ఏమైంది చెప్పండి అని రామరాజు అడుగుతాడు. అప్పుడే ధీరజ్ ఎంట్రీ ఇస్తాడు. నేనే ధీరజ్ ఏమైందని ఇన్‌స్పెక్టర్ ని ధీరజ్ అడుగుతాడు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఏమైందని అడుగుతావా అని ఇన్‌స్పెక్టర్ అనగానే అందరు షాక్ అవుతారు. ఒకమ్మాయి నీ క్యాబ్ బుక్ చేసుకుంది కదా.. ఆ అమ్మాయి కన్పించడం లేదని వాళ్ళ నాన్న నీపై కంప్లైంట్ ఇచ్చాడని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. ధీరజ్ ని ఇన్‌స్పెక్టర్ తీసుకొని వెళ్తుంటే రామరాజు అడ్డుపడతాడు.. అయిన సరే వాళ్ళు వినకుండా ధీరజ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తారు.

అదంతా భద్రవతి కుటుంబం చూసి వీడికి అలాంటివేం కొత్త కాదు.. డబ్బున్న అమ్మాయిని పెళ్లి పేరుతో మాయ చెయ్యడం అలవాటే అని సేనాపతి అంటాడు. ఆగండి నాన్న.. ధీరజ్ నన్నేం తీసుకొని వెళ్ళలేదు.. అసలు ధీరజ్ నన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడో తెలుసా అని ప్రేమ అసలు విషయం చెప్పబోతుంటే వేదవతి, నర్మద అడ్డుపడుతారు. ఆ తర్వాత రామరాజు స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ శోభ వాళ్ళ నాన్న ఉంటాడు. మా అబ్బాయి అలాంటివాడు కాదని రామరాజు చెప్తాడు. అయిన అతను వినిపించుకోడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.