English | Telugu

ముమైత్ ఖాన్ బ్రెయిన్ లో కొన్ని వైర్స్ ఉన్నాయి.. ఐనా స్టంట్ చేయడానికి వచ్చింది  

కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి శేఖర్ మాష్టర్, ముమైత్ ఖాన్ వచ్చారు. ఇక ముమైత్ ఖాన్ గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్ బాగుంది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఇంతకంటే గొప్పగా కావాలని వాళ్ళ అమ్మ మొక్కి పెట్టుకున్న పేరు ముమైత్ ఖాన్ అని చెప్పింది. "ముమైత్ ఖాన్ బ్రెయిన్ లో ఏడో, ఎనిమిదో వైర్స్ ఉన్నాయి. ఆమె ఎంత సఫర్ అయ్యిందో నేను చూసాను" అని హోస్ట్ తేజస్విని చెప్పింది. ఇక ముమైత్ చెప్తూ "అనరిజం కోయిలింగ్ అనే సమస్యతో బాధపడుతున్నాను. ఈ సమస్య వలన షూ లేస్ కట్టుకోవడం కూడా డేంజర్"అని చెప్పింది. మళ్ళీ తేజు మాట్లాడుతూ "షూ లేస్ కట్టుకోవద్దని డాక్టర్ చెప్తే బాంగ్ కాక్ కి స్టంట్ షో చేయడానికి వచ్చింది. ఒక రోజు స్టంట్ షో చేసేసింది నెక్స్ట్ డే ముమైత్ లేవడం లేదు" అని చెప్పింది.

మళ్ళీ ముమైత్ మాట్లాడుతూ "నేను స్వప్నా దత్ కి చెప్పాను నేను ఒక వేళా లేవలేకపోతే నేను చనిపోయినట్టు అని అర్ధం చేసుకో..నాకు ఆ సిట్యుయేషన్ ని యాక్సెప్ట్ చేయడానికి రెండేళ్లు పట్టింది " అన్నానని చెప్పింది. గాడ్ ఫాథర్ అన్న పొజిషన్ కానీ పేరు కానీ ఇవ్వాలంటే ఎవరికీ ఇస్తారు అని అడిగింది తేజు.."పూరి జగన్నాధ్, రాజమౌళి" అని చెప్పింది ముమైత్. ముమైత్ తన సివియర్ హెల్త్ కండిషన్ తో చాల ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇక ఇప్పుడు షోస్ లో కనిపిస్తోంది. అలాగే ఆహా వాళ్ళ డాన్స్ ఐకాన్ లో మెరిసింది. పోకిరి మూవీలో "ఇప్పటికింకా నా వయసు" అన్న ఐటెం సాంగ్ తో ముమైత్ ఫుల్ పాపులర్ అయ్యింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.