English | Telugu

"ఐ ల‌వ్ యూ మై ఫ‌రెవ‌ర్‌".. షణ్ముఖ్‌తో బంధంపై ఓపెన్ అయిన దీప్తి!

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునైనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మందికి ఇష్ట‌మైన సెల‌బ్రిటీల్లో ఆమె ఒక‌రు. త‌న రోజువారీ కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన ఫోటోలను దీప్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఆమెకు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ అంటే విప‌రీత‌మైన ప్రేమ అని ఆమె అనుచరులలో చాలామందికి ఇప్పటికే తెలుసు.

మూడేళ్ల క్రితం దీప్తికి షణ్ముఖ్ ప్ర‌పోజ్ చేశాడ‌నే ప్ర‌చారం ఉంది. అయితే ఇంత‌దాకా త‌మ మ‌ధ్య అనుబంధం ఉన్న‌ద‌నే విష‌యాన్ని దీప్తి బాహాటంగా ఒప్పుకోలేదు, అలాగ‌ని తిర‌స్క‌రించ‌నూ లేదు. ఏదేమైన‌ప్ప‌టికీ, సోష‌ల్ మీడియాలో వారిద్ద‌రూ క‌లిసున్న ఫొటోలు వారి బంధం గురించిన సంకేతాల‌ను అందిస్తుంటాయి.

సెప్టెంబర్ 16 ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా అత‌డి బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేయ‌డానికి బుధ‌వారం రాత్రి అన్న‌పూర్ణ స్టూడియోస్‌కు వెళ్లింది దీప్తి. అక్క‌డే బిగ్ బాస్ హౌస్ సెట్ ఉంది. మామూలుగా అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి అతిథుల్ని కానీ, కంటెస్టెంట్ల కుటుంబ‌స‌భ్యుల‌ను కానీ అనుమ‌తించ‌రు. అందుక‌ని దీప్తి హౌస్ గేట్ ద‌గ్గ‌ర‌కు ఒక కేక్ తీసుకొని వెళ్లింద‌నీ, దూరం నుంచే అత‌డ్ని పిలిచి బ‌ర్త్‌డే విషెస్ చెప్పింద‌నీ లేటెస్ట్‌గా లీకైన వీడియోలో క‌నిపించింది. దీప్తిని చూసి అమితాశ్చ‌ర్యానికి గురైన ష‌ణ్ముఖ్ ఆమెకు థాంక్స్ చెప్పాడు.

ఇక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా ష‌ణ్ముఖ్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసింది దీప్తి. అత‌డికి స‌న్నిహితంగా ఉన్న రెండు ఫొటోల‌ను షేర్ చేసిన ఆమె, "హ్యాపీ బ‌ర్త్‌డే ష‌ణ్ణు. ఎప్ప‌టికీ ఐ ల‌వ్ యూ" అని రాసుకొచ్చింది. దాంతో పాటు హార్ట్ ఎమోటికాల‌ను జోడించింది. ఆ పోస్ట్ ద్వారా ఆమె ష‌ణ్ముఖ్‌ను ఎంత‌గా ప్రేమిస్తుందో అర్థ‌మైపోతోంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.